ఔను.. ఇది బ‌ల‌మైన సంకేతం.. జ‌గ‌నే జాగ్ర‌త్త‌ప‌డాలి!

2024 ఓ విషాదం కాదు.. వైసీపీ దూకుడుకు, దుర‌హంకారానికి వేసిన బ్రేకులుగా భావించిన‌ప్పుడు 2025లో ఉజ్వ‌ల‌మైన భ‌విత‌వ్యాన్ని చేజిక్కించుకునే అవ‌కాశం క‌ల్పించ‌క‌మాన‌దు.

Update: 2024-12-31 23:30 GMT

కొన్ని కొన్ని విష‌యాలు చెప్పిజ‌ర‌గ‌వు. జ‌రిగిన త‌ర్వాతే మ‌నం తెలుసుకుంటాం. అయ్యో.. అలా జ‌రిగిం దేంటి? అని అనుకునే స‌రికి న‌ష్టం నాలుగు అడుగులు ముందుకు వెళ్లిపోతుంది. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తోంది. పార్టీకి బ‌ల‌మైన సంకేతాలు వస్తున్నాయి. ఇక‌, జాగ్ర‌త్త ప‌డాలి సుమా! అనుకునేంత స్థాయిలో ఈ సంకేతాలు హెచ్చ‌రిక‌లు కూడా చేస్తున్నాయి. దీనిని బ‌ట్టి జ‌గ‌న్ త‌న‌ను తాను మార్చుకోవాలి.. పార్టీని ప‌దింత‌లు మెరుగైన స్థాయిలో న‌డిపించాలి.

ప్ర‌త్యామ్నాయం జ‌గ‌నే!

ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను చూస్తే.. ప్ర‌త్యామ్నాయ శ‌క్తి వైసీపీనే. ప్ర‌త్యామ్నాయ నాయ కుడు కూడా జ‌గ‌నే. ఇది అంద‌రూ ఒప్పుకొనే మాటే. కానీ.. చేజేతులా చేసుకున్న అప‌రాధాలు.. మూర్ఖ‌త్వపు నిర్ణ‌యాలు వంటివి పార్టీని.. అధినేత‌గా జ‌గ‌న్‌ను పాడు చేశాయి. రెండు స్థానాల నుంచి బీజేపీ ఎదిగిన ట్టుగా..వైసీపీకి కూడా ఫ్యూచ‌రేమీ పోలేదు. భ‌విష్య‌త్తు య‌వ‌నిక‌పై విరాజిల్లే స‌మ‌యం కూడా చాలానే ఉంది. మ‌రోసారి కాక‌పోతే.. ఇంకొసారైనా జ‌గ‌న్‌కు అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.

కానీ, మార్పు దిశ‌గా ఆయ‌న అడుగులు వేసిన‌ప్పుడు.. మార్పు దిశ‌గా పార్టీని న‌డిపించిన‌ప్పుడు మాత్ర‌మే ఈ ప్రత్యామ్నాయ రాజ‌కీయం ఆయ‌న‌కు ప‌దిలం అవుతుంద‌న్న విష‌యాన్ని గుర్తెర‌గాల్సి ఉంటుంది. ప్ర‌తి విష‌యాన్నీ నిశితంగా గ‌మ‌నించాలి. ఎవ‌రు త‌న వారో.. ఎవ‌రు ప‌గ‌వారో.. ఎవ‌రు ప‌నికిరాని వారో గుర్తించగ‌ల‌గాలి. లేక‌పోతే.. ఇప్పుడున్న ప‌రిస్థితి మున్ముందు మ‌రింత పెరిగిపార్టీనే లేకుండా చేసినా ఆశ్చ‌ర్యం లేదు. కాబ‌ట్టి.. జ‌రిగింది మ‌న మ‌న‌మంచికే అనుకోమ‌న‌ట్టు..ఈ ఓట‌మి..ఈ ప‌రాభ‌వం నుంచి అనేక పాఠాలు నేర్చుకునే అవ‌కాశం జ‌గ‌న్ ఉంది.

2024 ఓ విషాదం కాదు.. వైసీపీ దూకుడుకు, దుర‌హంకారానికి వేసిన బ్రేకులుగా భావించిన‌ప్పుడు 2025లో ఉజ్వ‌ల‌మైన భ‌విత‌వ్యాన్ని చేజిక్కించుకునే అవ‌కాశం క‌ల్పించ‌క‌మాన‌దు. ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం.. దూర‌దృష్టితోస‌భ‌ల‌కు వెళ్ల‌డం.. స‌భామ ర్యాద‌ను తాను కాపాడి.. త‌న వారితో కాపాడేలా చేయ‌డం.. దూకుడు నేత‌ల‌ను క‌ట్ట‌డి చేసి.. బూతుల నేత‌ల‌కు హ‌ద్దులు గీసి.. పార్టీని స‌వ్య‌మైన మార్గంలో న‌డిపించేందుకు 2025 ఒక బృహ‌త్త‌ర అవ‌కాశం. ఆ దిశ‌గా జ‌గ‌న్ న‌డుస్తార‌ని పార్టీ అభిమానులు ఆశిస్తున్నారు.

Tags:    

Similar News