బుజ్జగింపు రాజకీయాలే జగన్‌కు శరణ్యమా?
అయినా.. జగన్ కించిత్తు కూడా.. వారిని బ్రతిమాలింది లేదు. బుజ్జగించింది కూడా లేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. కూటమి బలోపేతం అవుతోంది.;
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. వెనక్కి తగ్గక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు పోయేవారు పోనీ.. అన్నట్టుగానే జగన్ వ్యవహరించారు. ఎంతమంది నాయకులు పోయినా.. జగన్ వెనుది రిగింది లేదు.. వారిని బుజ్జగించింది కూడా లేదు. వీరిలో సామాజిక వర్గాలను బలోపేతం చేయగలిగిన నాయకులు, జంగా కృష్ణమూర్తి వంటిబలమైన బీసీ నేతలు.. చివరకు తనకు రైట్ హ్యాండ్ వంటి సాయిరె డ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారుసైతం.. పార్టీ నుంచి జంప్ చేసేశారు.
అయినా.. జగన్ కించిత్తు కూడా.. వారిని బ్రతిమాలింది లేదు. బుజ్జగించింది కూడా లేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. కూటమి బలోపేతం అవుతోంది. గేట్లు తెరిస్తే.. వైసీపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే(జగన్) మిగులుతారంటూ.. కూటమి పార్టీల నాయకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా వైసీపీ ఖాళీ అయితే.. అప్పుడు చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో జగన్ తన పంథాను మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇది ఎలా ఉన్నా.. దీనికి మించి.. ఇప్పుడు కీలక నాయకులు పోవడం ఎలా ఉన్నా.. వారు నోరు విప్పితే.. తన రాజకీయ వ్యవహారాలు.. అధికారంలో ఉండగా తీసుకున్న పలు కీలక నిర్ణయాలు కూడా.. బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయిరెడ్డి తాజాగా.. కాకినాడ సీపోర్టు విషయంలో ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పేశారు. ఇక, ముందు కూడా.. ఆయన మరిన్ని విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇలాంటి నాయకులు చాలా మంది ఉన్నారు.
రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఈ జాబితాలోనే ఉన్నారు. ఆయనకు కూడా జగన్ వ్యవహారాలు చాలానే తెలుసు. అదేవిధంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వంటివారు కూడా.. పార్టీ వ్యవహారాలు తెలిసిన వారే. ఇప్పుడు ఇలాంటి వారు బయటకు వెళ్లిపోతే.. వెళ్లినట్టు అయితే ఉండరు. పార్టీ కార్యక్రమాలను బయట పెట్టే అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పుడు జగన్ పార్టీ నాయకులను బుజ్జగించక తప్పని పరిస్థితి ఏర్పడిందన్న చర్చ సాగుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి.