జమిలీకి జగన్ రెడీ.. ప్లాన్ ఇదే... !
అయితే.. అధికారం పోతే ఎలా ఉంటుందో.. ఇప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది.
అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎంజాయ్ మెంటు వేరుగా ఉంటుంది. చుట్టూ మందీ మార్బలం, నాయకుల జోరు... హోరు.. వంటివి అధినేతలకు మత్తును కలిగిస్తాయి. దాని నుంచి ఎప్పుడు బయట పడతారంటే.. అధికారం పోయినప్పుడే. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ విషయంలో అదే జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు.. అందరూ ఎన్నో చెప్పారు. కళ్లముందే.. కదలిపోతున్న పీఠాలు, వెళ్లిపోతున్న నాయకులు కూడా కనిపించారు. కానీ.. జగన్ లైట్ తీసుకున్నారు.
అయితే.. అధికారం పోతే ఎలా ఉంటుందో.. ఇప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది. అందుకే.. ఇప్పుడు జగన్ .. ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తున్నారు. కేంద్రం ప్రకటించిన జమిలి ఎన్నికలకు మద్దతు పలకడం వెనుక రీజన్ కూడా ఇదే కావడం గమనార్హం. జమిలి ఎన్నికలు వస్తే.. ప్రజలు తననే ఎన్నుకుంటారన్నది జగన్ ధీమా. ఈ క్రమంలోనే ఆయన సంక్రాంతి తర్వాత.. నియోజకవర్గ టూర్, బుధ, గురువారాల్లో నిద్రలు పెట్టుకున్నారు.
వాస్తవానికి జగన్ వ్యూహం పార్టీ పటిష్ఠతకు, నాయకులు, కార్యకర్తలను ఊరడించేందుకు.. పార్టీని బలోపేతం చేసేందుకు కాదు. జమిలి ఎన్నికలకు పార్టీని రెడీ చేయడమేనని అంటున్నారుపరిశీలకులు. ఎందుకంటే.. ఇప్పటి నుంచే ప్రారంభిస్తే తప్ప.. జగన్‌కు నిజంగానే జమిలి వచ్చినా.. విజయం దక్కే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. జగన్.. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించే జగన్ పర్యటనలకు.. పూర్తిగా ఎన్నికల నేపథ్యమే ఉంటుందని అంటు న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది కాలంలో పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ లోగా హైకోర్టు లో తమకు అనుకూలంగా తీర్పు వచ్చి.. ప్రధాన ప్రతిపక్ష హోదా కనుక లభిస్తే.. అప్పుడు సభలోకి అడు గులు వేయనున్నారు. లేకపోతే.. అప్పటి వరకు ప్రజల మధ్యే ఉండాలన్న లక్ష్యంతో జగన్ ముందుకు సాగుతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా.. జమలికి సిద్ధమవుతున్న జగన్.. ప్లాన్ బాగానే చేసుకుంటున్నట్టు చెబుతున్నారు.