బెంగ లేని చోట...జగన్ రాజకీయ ఆట !

ఈలోగా తాడేపల్లిలో కూర్చుని ఉండడం కంటే బెంగళూరులో ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కి ప్లాన్స్ వేసుకోవడమే బెటర్ అని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది

Update: 2024-08-18 16:30 GMT

జగన్ అంటే తాడేపల్లి అన్నట్లుగా 2019 నుంచి రాజకీయ కధ సాగింది. అయితే అదే జగన్ 2024 ఎన్నికల్లో ఓడాక తాడేపల్లి బోసిపోయింది. ఈ ప్యాలెస్ లో నెలలో చాలా రోజులు జగన్ లేని లోటు కనిపిస్తోంది. జగన్ గడచిన రెండు నెలలుగా బెంగళూరు టూ తాడేపల్లి అంటూ షటిల్ సర్వీస్ చేస్తున్నారు.

బెంగళూరు ఎహలెంక ప్యాలెస్ లో జగన్ విడిది చేస్తున్నారు. ఆయన తాడేపల్లికి ఇపుడు చుట్టం అయిపోయారని కూడా సెటైర్లు వేస్తున్న వారు ఉన్నారు. జగన్ వీకెండ్స్ లో బెంగళూరు కి వెళ్తున్నారు. ఇక వీక్ స్టార్టింగ్ లో తాడేపల్లికి వచ్చి అక్కడ రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటున్నారు.

నిజానికి జగన్ ఓటమి చెందాక మాజీ సీఎం గా తన పొలిటికల్ యాక్టివిటీని అయితే తాడేపల్లి నుంచి పెద్దగా చేయడం లేదు అని అంటున్నారు. ఆయన బెంగళూరు కేంద్రంగా తన రాజకీయానికి పదును పెడుతున్నారు అని అంటున్నారు. బెంగళూరు తనకు సేఫెస్ట్ ప్లేస్ గా ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు.

గతంలో ఇష్టపూర్వకంగా కట్టించిన ఎహలెంక ప్యాలెస్ ఇపుడు జగన్ మలి విడత రాజకీయానికి ప్రధాన కేంద్రంగా ఉంది అని అంటున్నారు. కాంగ్రెస్ ఏలుబడిలో కర్ణాటక ఉంది. జగన్ కూడా ఇండియా కూటమి వైపు గా అడుగులు వేస్తున్నారు అన్న చర్చ ఉంది. కాంగ్రెస్ పెద్దలతో టచ్ లోకి వెళ్లారని పుకార్లు అయితే ఉన్నాయి. కానీ వీటి మీద క్లారిటీ మాత్రం లేదు.

మరో వైపు చూస్తే ఏపీలో టీడీపీ కూటమి సర్కార్ కన్నా తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కన్నా బెంగళూరులో కాంగ్రెస్ ఏలుబడిలో ఉండడమే బెంగ లేని రాజకీయానికి అవకాశం అని జగన్ గట్టిగా తలపోస్తున్నారు అని అంటున్నారు. జగన్ ఏ రకమైన వ్యూహాలు చేసినా ఏ విధంగా పొలిటికల్ స్టెప్స్ తీసుకున్నా బెంగళూరులో నుంచి అవి పెద్దగా బయటకు వెళ్లే అవకాశాలు లేవు అని అంటున్నారు.

నిఘా నేత్రాల నుంచి బయటపడి తన దైన రాజకీయాన్ని స్వేచ్చగా చేసుకునేందుకు జగన్ కి బెంగళూరు కంటే మించిన ప్లేస్ మరోటి లేదని అంటున్నారు. బెంగళూరులో జగన్ రాజకీయ వ్యూహాలు కూడా ఎవరికీ తెలిసే అవకాశాలు లేవు అని అంటున్నారు. ఏపీలో చూస్తే కూటమి సర్కార్ ఇంకా హానీమూన్ పీరియడ్ లో ఉంది. ఆరు నెలల సమయం ఇచ్చి ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత చూసుకుని అపుడు ఏపీలో గ్రౌండ్ లో పోరాటాలకు సిద్ధ పడవచ్చు అన్నది వైసీపీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు.

ఈలోగా తాడేపల్లిలో కూర్చుని ఉండడం కంటే బెంగళూరులో ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కి ప్లాన్స్ వేసుకోవడమే బెటర్ అని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది అని అంటున్నారు.జగన్ వరకూ చూసుకుంటే ఆయనకు బెంగళూరు పొలిటికల్ గా ఎంతో రిలీఫ్ గా ఉంది అని అంటున్నారు.అందుకే ఆయన బెంగళూరుని ఇష్టపడుతున్నారు అని అంటున్నారు. గడచిన రెండు నెలలలో జగన్ పదిసార్లు బెంగళూరు వచ్చారు అంటేనే ఆయన బెంగళూరు కి ఎంతలా కనెక్ట్ అయిపోయారో అర్ధం చేసుకోవచ్చు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే పార్టీ ప్రక్షాళన గురించి కూడా జగన్ సీరియస్ గానే ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా పార్టీలో ఉండేదెవరో పోయేది ఏవరో ఒక క్లారిటీ వచ్చిన మీదటనే తగిన యాక్షన్ ప్లాన్ తో వస్తే బాగుంటుంది అన్నది కూడా ఆలోచిస్తున్నారని అంటున్నారు. వైసీపీ ఓటమి పాలు అయినా నలభై శాతం పైగా ఓటు బ్యాంక్ ఉంది. అలాగే ఓడిన తరువాత జనంలోకి వెళ్తే జగన్ కి ప్రజాదరణ బాగానే లభించిది. ఇక లీడర్స్ పోయినా క్యాడర్ తనతోనే ఉంటుంది అన్న నిబ్బరం కూడా ఉందిట.

అందుకే రానున్న రోజులలో రాజకీయ వ్యూహాలనే నమ్ముకుని ముందుకు సాగితేనే వైసీపీ ఒడ్డున పడుతుందని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆ వ్యూహాల కోసమే ఆయన బెంగళూరుని విడిదిగా చేసుకున్నారు అని అంటున్నారు. మొత్తానికి తేలేది ఏంటి అంటే జగన్ కి బెంగళూరు విడిది ఆయన ఏపీకి అతిది అని. ఇదే మాట ప్రత్యర్థులు కూడా అంటున్నారు.

ఆయన ఏపీకి చుట్టం అని కూటమి అంటున్నా వైసీపీ అధినాయకత్వం మాత్రం దానిని పట్టించుకునే స్థితిలో లేదు. పోయిన చోటనే వెతుక్కోవడానికి జగన్ తీవ్రంగా మధనం చేస్తున్నారు అని అంటున్నారు. సో ఆయన డిస్టర్బ్ గా ఉండకుండా రిలీఫ్ గా ఫీల్ అవ్వాలంటే బెంగళూరుని మించిన స్పాట్ వేరొకటి లేదని అంటున్నారు.

Tags:    

Similar News