చంద్రబాబుకు మంచి చేయడం తెలీదు: సీఎం జగన్
ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు పని అని వ్యాఖ్యానించారు. హంద్రీనీవాను దివంగత నేత వైఎస్సార్ పూర్తి చేశారని సీఎం చెప్పారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. డోన్ లో నిర్వహించి న బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ నీటి కష్టాలు తన కు తెలుసునని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సాగునీటి కోసం చర్యలు చేపట్టామ న్నారు. గతంలో డోన్‌లో ఒక్క ఎకరం కూడా ఇరిగేషన్‌లో లేదని, గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల కష్టాల ను పట్టించుకోలేదని పేర్కొన్నారు.
ఈ రోజు(మంగళవారం) ప్రారంభించిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుతో డోన్, పత్తికొండ నియోజక వర్గాల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. తమ ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా? అన్నది చూడాలని ఆయన పిలుపు నిచ్చారు. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌కు.. తాము ప్రవేశ పెట్టిన బడ్జెట్‌కు తేడా లేదని.. అయితే, ప్రజలకు ఆర్థికంగా సాయం చేయడంలోనే తేడా ఉందని విమర్శించారు.
అబద్ధాలు, మోసాలను ప్రజలు నమ్మవద్దని సీఎం జగన్ సూచించారు.ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అన్నది ఆలోచించాలన్నారు. ``ఇప్పుడు మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు.. చంద్రబాబు హయాంలో ఎందుకు చేయలేదని అడుగుతున్నా.అప్పుడు ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్.. అప్పటి కంటే అప్పులు తక్కవ చేశాం. అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి రూ. 2 లక్షల 35 వేల కోట్లు జమ చేశాం. విద్య, వైద్య, మహిళా సంక్షేమంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. కానీ చంద్రబాబు మాత్రం చేయడు.. చేయాలనే మనసేరాదు`` అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడూ ఉండదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చంద్ర బాబు మంచిని చేయడం ఎప్పుడూ నమ్ముకోలేదన్నారు. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు పని అని వ్యాఖ్యానించారు. హంద్రీనీవాను దివంగత నేత వైఎస్సార్ పూర్తి చేశారని సీఎం చెప్పారు. అధికారం లోకి రాగానే రాయలసీమకు లిఫ్ట్ పనులు, వెలుగొండ ప్రాజెక్టును వడివడిగా పూర్తి చేస్తున్నామన్నారు. ఆ మహానేత బిడ్డ హయాంలో ప్రజలకు మంచి జరుగుతోందని వ్యాఖ్యానించారు.