వైసీపీ ఊపేంటి.. అసెంబ్లీ విషయంలో ఊగిసలాట!
అలానే ఏయే పథకాలకు ఎంత మొత్తం నిధులను కేటాయిస్తారనేది కూడా తెలుస్తుంది.
ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం రెడీ అయింది. సోమవారం(జూలై 22) నుంచి మధ్యంతర బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు చంద్రబాబు సర్కారు రెడీ అయింది. ఈ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు సమాయత్తమయ్యారు. అంటే.. వచ్చే ఏడు మాసాలకు సంబంధించిన ఖర్చుల వివరాలను ప్రకటిస్తారు. అలానే ఏయే పథకాలకు ఎంత మొత్తం నిధులను కేటాయిస్తారనేది కూడా తెలుస్తుంది. ఇంత వరకు ఓకే.. మరి వైసీపీ మాటేంటి? ఇదీ.. ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఎందుకంటే.. 11 మంది ఎమ్మెల్యేలతో సభలో అడుగు పెట్టేందుకు జగన్. సంసిద్ధంగా ఉన్నారా? లేరా? అనే విషయంలో ఆయన తర్జన భర్జన పడుతున్నట్టు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిలో నూ ఈ విషయం ఆసక్తిగా ఉంది. సభకు వెళ్లి... గడిచిన 40 రోజుల పాలనలోని లోపాలను ఎత్తి చూపాలని సీనియర్లు చెబుతుండగా.. అసలు సభా వ్యవహారాలపై ఆహ్వానం అందినప్పుడు చూద్దామని పార్టీ అధి నేత జగన్ మౌనంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
అయితే. సభకు వచ్చినా.. సమస్యలు ప్రస్తావించేందుకు పెద్దగా అవకాశం చిక్కక పోవచ్చు. ఎందుకంటే.. సభలో సంఖ్యాబలం ఆధారంగానే మైకులు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఒకవేళ నిరసన వ్యక్తం చేసినా.. ప్రయోజనం లేదు. ఎలా చూసుకున్నా.. గళం వినిపించేందుకు పెద్దగా అవకాశం దక్కకపోయినా.. మీడి యా అటెన్షెన్ సహా.. ప్రజల అటెన్షన్‌ను వైసీపీ సొంతం చేసుకునేందుకు చాన్స్ కనిపిస్తోంది. సభలకు వెళ్లడం లేదు.. అనే అపప్రదకు దూరంగా ఉండే అవకాశం కూడా ఉంది.
ఇర. సభకు వెళ్లి.. హాజరు వేయించుకుని బయటకు వచ్చేస్తే.. శాలరీ దక్కుతుంది.. అలవెన్సులు కూడా వస్తాయి. ఈ దిశగా కూడా.. ఆలోచన చేస్తున్నారు కొందరు ఎమ్మెల్యేలు. జగన్‌ను పక్కన పెడితే.. గెలిచిన వారిలో ఒకరిద్దరు మినహా.. మిగిలినవారు సభకు వెళ్తేనే బెటర్ అని సలహాలు ఇస్తున్నారు. అవకాశం ఇవ్వకపోతే..దానినే అడ్వాంటేజ్‌గా తీసుకుని.. మీడియా ముందుకు.. ప్రజల మధ్యకువ చ్చే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. కానీ.. అసెంబ్లీ విషయంలో వైసీపీ ఇంకా ఊగిసలాటలోనే ఉండడం గమనార్హం.