జగన్ ఆ రోల్ లోనే సక్సెస్...ప్రూవ్స్ ఉన్నాయిగా !

కొందరు కొన్ని పాత్రలో సూపర్ హిట్ అవుతారు. అది వారికే సాధ్యం అని కూడా చెప్పవచ్చు.

Update: 2024-07-23 00:30 GMT

కొందరు కొన్ని పాత్రలో సూపర్ హిట్ అవుతారు. అది వారికే సాధ్యం అని కూడా చెప్పవచ్చు. జగన్ విషయం తీసుకుంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కంటే విపక్ష పాత్రలో బాగా హైలెట్ అవుతారు. జగన్ అగ్రెసివ్ మోడ్ ని చూడాలన్నా ఆయన జనంలోకి రావాలన్నా ఆయన విమర్శలలో పదును గమనించాలన్నా విపక్షం పాత్రంలోనే సాధ్యం అని అంటారు.

ఇదంతా ఎందుకు అంటే జగన్ అధికారంలో ఉన్నారు. విపక్షంలోనూ ఉన్నారు. జగన్ 2009 తరువాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఏకంగా పదేళ్ల పాటు ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఆనాడు కేంద్రంలో బలమైన యూపీఏ ప్రభ్యుత్వం మీద రాజకీయ దండయాత్ర చేసి జగన్ ఎక్కడా తగ్గలేదు అనిపించారు. దానికి పరిహారంగా జైలు జీవితం అనుభవించారు.

అలా 2014 దాకా కాంగ్రెస్ తో పోరాడిన జగన్ విభజన అనంతరం ఏపీలో ఏర్పడిన టీడీపీతో తన పోరాట పంధాను మార్చి రాటుదేలారు. చంద్రబాబుతో అయిదేళ్ళ పాటు డైరెక్ట్ ఫైట్ చేశారు. ఈ అలుపెరగని పోరాటాలే జగన్ ని జనంలో హీరోగా మార్చాయి. ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

జగన్ 2019 నుంచి 2024 దాకా అయిదేళ్ల పాటు సీఎం గా ఉన్నారు. అయితే జనంతో పార్టీ జనంతో కనెక్షన్లు కట్ అయ్యాయని ప్రచారంలో ఉన్న మాట. ప్రతిపక్షంలో దూకుడుగా ఉన్న నేతలు అధికారంలోకి వస్తే మరింత జాగ్రత్త పడాలి. తాము అప్పటి అధికార పక్షం మీద వేసిన రాళ్ళను అన్నీ వారు సేకరించి తమ మీదకు తిరిగి విసురుతారు అని గ్రహించగలగాలి. కానీ జగన్ అయితే ఇవేమీ పట్టించుకున్నారో లేదో తెలియదు. కనీసం పదేళ్ల పాటు అధికారానికి సరిపడా మెజారిటీని గొప్పగా ఇచ్చి అందలంలో కూర్చోబెడితే కేవలం అయిదేళ్లకే విపక్షంలోకి వచ్చేసి ఘోరంగా పరాజయం పాలు కావడం జగన్ కే చెల్లింది అని కూడా విమర్శలు వచ్చాయి.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జగన్ ఇప్పట్లో విపక్ష పాత్రలోకి రాలేరు అనుకున్నారు. కానీ ఆయన చాలా తొందరగానే బయటపడ్డారు. విపక్ష పాత్రలోకి సక్సెస్ ఫుల్ గా ప్రవేశించారు. పాత జగన్ మళ్లీ కనిపిస్తున్నారు అని అంతా అంటున్నారు అంటే ఆయన విపక్ష పాత్ర అదుర్స్ అనే కదా అని కూడా విశ్లేషిస్తున్నారు.

అయితే అధికారంలో ఉన్నపుడు నిభాయించడం అందరికీ సంతృప్తి పరచడం కష్టం. పైగా అందలంలో కూర్చున్నాక బయట ప్రపంచం కనబడదు. అలా అధికార వైభోగం అనే మాయ ఉంటుంది. దాంతో జగన్ అయిదేళ్ళ పాటు సీఎం అయినా ఆ పాత్రలో పూర్తిగా జనాలను పార్టీ జనాలను మెప్పించలేక పోయారు అని అంటున్నారు.

ఇపుడు జగన్ విపక్ష పాత్రలోకి రావడం రెండోసారి. ఆయన అధికారమూ చూసారు కాబట్టి గత అనుభవాలను రంగరించి మరీ తన పాత్రలో దూకుడు చేస్తారు అని అంటున్నారు. సరైన సమయంలోనే జగన్ విపక్ష నేతగా జనంలోకి వచ్చారు అని అంటున్నారు. ఏపీలో అధికార పక్షంలో మూడు పార్టీలు ఉన్నాయి.

విపక్షం సీటు మాత్రం ఖాళీగా ఉంది అందులోకి చేరేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నా బలం ఎక్కడా సరిపోవడం లేదు. అలాగే కమ్యూనిస్టులూ ఉన్నారు. దాంతో బలమైన టీడీపీ కూటమిని ఎదుర్కోవాలంటే వైసీపీకే సాధ్యం అని కూడా అంటున్నారు.

కానీ గత రెండు నెలలుగా భారీ ఓటమి తాలూకా ప్రభావంతో నీరసించిన వైసీపీ కార్యక్షేత్రంలోకి రాలేకపోయింది. ఇపుడు ఆ లోటుని తీర్చేలా జగన్ ముందుకు వచ్చారు. ఆయన లా అండ్ ఆర్డర్ ఇష్యూ ని ఎంచుకున్నారు. ఇది కొంతవరకూ ఓకే కానీ ముందు ముందు ప్రజా సమస్యలతో కనెక్ట్ అయ్యే అనేక ఇతర ఇష్యూస్ ని ఎంచుకుంటే ఆయన విపక్ష పాత్రకు మరింతగా మన్ననలు అందుతాయని అంటున్నారు.

ఇక టీడీపీ కూటమికి బడ్జెట్ సెషన్ తొలిరోజే వైసీపీ తన పోరాట పంధా ఏమిటో స్పష్టంగా చెప్పింది. అయిదేళ్ళూ ఇలాగే ఉంటుందని కూడా చాటి చెప్పింది. దాంతో రానున్న రోజులలో కూటమి వర్సెస్ వైసీపీ పాలిటిక్స్ ని ఏపీలో హాట్ హాట్ గా చూడబోతున్నారు అంతా.

Tags:    

Similar News