రేవంత్ రెడ్డిపై పాత ప‌గ తీర్చుకుంటున్న జ‌గ్గారెడ్డి!?

త‌న అనుచరుడు గంగారెడ్డి హత్య గురించి క‌ల‌త చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏకంగా రోడ్డెక్కి నిర‌స‌న తెలిపారు.

Update: 2024-10-25 22:30 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మెళ్లిగా అంత‌ర్గ‌త లుక‌లుక‌ల సెగ మొద‌లవుతున్న‌ట్లు క‌నిపిస్తున్నాయి. పార్టీ నేత‌లు ఇన్నాళ్లుగా త‌మ‌లోనే అణుచుకున్న అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం ప్రారంభించిన‌ట్లు చెప్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ, పార్టీ సీనియ‌ర్ నేత అయిన మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన జ‌గిత్యాల‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల గురించి బ‌హిరంగంగానే అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ జాబితాలోకి మ‌రో ముఖ్య నేత అయిన జ‌గ్గారెడ్డి కూడా చేరిన‌ట్లు క‌నిపిస్తోంది.

త‌న అనుచరుడు గంగారెడ్డి హత్య గురించి క‌ల‌త చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏకంగా రోడ్డెక్కి నిర‌స‌న తెలిపారు. అంతేకాకుండా మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కొందరు బీఆర్ఎస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. చట్టంలో లొగులు ఉపయోగించి ఫార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నట్లు జీవన్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన వారిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని హైకమాండ్ ను కోరారు. అంతేకాకుండా ఏకంగా పార్టీ జాతీయ అధ్య‌క్షుడికి లేఖ రాశారు. దాన్ని పార్టీ ముఖ్య నేత‌లైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు.

అయితే, తాజాగా ఆయ‌న‌కు ఊహించ‌ని రీతిలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డి మ‌ద్ద‌తు ప‌లికారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి మద్దతుగా జగ్గారెడ్డి స్పందిస్తూ జీవన్‌ రెడ్డి ఆవేదన చూసి బాధ అనిపించిందని అన్నారు. జీవన్‌రెడ్డికి అండగా తాను ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. జీవన్‌రెడ్డి కాంగ్రెస్ వాది అని పేర్కొన్న జ‌గ్గారెడ్డి ఆయన జీవితమంతా కష్టాలేన‌ని వాపోయారు. 'జగిత్యాలలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. జీవన్‌రెడ్డి ఎప్పుడూ జనాల్లో ఉంటారు., ఈ వయసులో జీవన్‌రెడ్డి ఆవేదన చూసి మనసు కలుక్కుమంది. జీవన్‌రెడ్డి ఒంటరి అనుకోవద్దు. ఆయ‌న‌ వెంట నేనుంటా. నిత్యం జనం మధ్య ఉండే జీవన్‌ రెడ్డిని జగిత్యాలలో.. నన్ను సంగారెడ్డిలో ప్రజలు ఎందుకు ఓడగొట్టారో అర్థం కావడం లేదు.' అంటూ జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా, జీవన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై సంచలన వ్యాఖ్యలు చేయ‌డం అంతేకాకుండా ఒకింత సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ముఖ్య నేత‌లు ఎవ‌రు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌లేదు. అయితే, కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జ‌గ్గారెడ్డి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాగా, గ‌తంలో రేవంత్ రెడ్డి తో ఉన్న విబేధాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే జ‌గ్గారెడ్డి ఇప్పుడు ఈ చాయిస్ తీసుకున్నారా అనే టాక్ తెర‌మీద‌కు వ‌స్తోంది.

Tags:    

Similar News