ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు!

ఇప్పుడు ఈ సాంకేతికతపై రకరకాల అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి.

Update: 2024-10-07 06:07 GMT

ప్రపంచ సంకేతిక రంగంలో తాజా విప్లవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సాంకేతికతపై రకరకాల అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. ఏఐ వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఒకరంటే.. మనిషికి తోడు మనిషే ఉండాలనే అవసరాన్ని, ఆలోచననూ ఏఐ చంపేస్తుందని మరొకరు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే ఈ సాంకేతికతను ప్రపంచలోని దాదాపు అన్ని దేశాలు ఉపయోగంలోకి తీసుకుతెచ్చుకున్నాయి! ఇందులో మంచీ ఉందీ చెడూ ఉందనే కామెంట్లూ మరోపక్క వినిపిస్తున్నాయి. ఈ సమయంలో భారత విదేశీ వ్యవహారల శాఖ మంత్రి జైశంకర్ మాత్రం తాజాగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

అవును... తాజాగా జరిగిన కౌటిల్య ఎకనామిక్ సదస్సులో పాల్గొన్న కేంద్రమంత్రి జైశంకర్... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... రాబోయే దశాబ్ధి కాలంలో ప్రపంచాన్ని ఏఐ తీవ్ర ప్రభవితం చేస్తుందని అన్నారు. ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో ఏఐ అనేది కీలకమైన అంశం అని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే... ఒకప్పటి అణ్వాయుధాల్లానే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ప్రమాదకరమని.. దీని నుంచి సంభవించే పరిణామాలను ఎదుర్కోవడానికి అన్ని దేశాలూ సిద్ధంగా ఉండాలని జైశంకర్ అన్నారు. ఈ సందర్భంగా రానున్న కాలంలో ఈ ప్రపంచంపై ఏఐ ప్రభావం అధికంగా ఉండనుందని తెలిపారు.

ఇదే క్రమంలోనూ ఐక్యరాజ్యసమితి పైనా మంత్రి ఆసక్తికరంగా స్పందించారు. ఇందులో భాగంగా... కౌటిల్య ఎకనామిక్ సదస్సు.. ఆర్థికపరమైన సమావేశం కావడం వల్ల తను బిజినెస్ మాటల్లోనే వివరిస్తానని చెప్పిన జైశంకర్... ఐక్యరాజ్య సమితి అనేది పాత వ్యాపారంలా మారిందని.. బిజినెస్ ప్రపంచంలో స్టార్టప్ ల మాదిరిగా ముందుకు సాగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News