హాలీవుడ్ ద‌ర్శ‌క దిగ్గ‌జం వుడ్ ఇల్లు బూడిద‌!

ఈ విష‌యాన్ని బాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు జేమ్స్ వుడ్ త‌న సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు.

Update: 2025-01-11 16:55 GMT

అగ్ర‌రాజ్యం అమెరికాలోని లాస్ ఏంజెలస్‌లో కార్చిచ్చు క‌మ్ముకున్న విష‌యం తెలిసిందే. గ‌త రెండు రోజులుగా కార్చిచ్చు.. ఈ మ‌హాన‌గ‌రాన్ని కాల్చి బూడిద చేస్తోంది. అత్యంత సంప‌న్నులు నివ‌శించే ఈ న‌గ‌రంలో రాజుకున్న చిచ్చు.. ఎన్ని వంద‌ల ఫైర్ ఇంజ‌న్ల‌ను మోహ‌రించి ఆర్పేందుకు ప్ర‌య‌త్నించినా.. ఫ‌లితం లేకుండా పోయింది. ఈ కార్చిచ్చులో బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుల ఇళ్ల‌తోపాటు.. అనేక ప‌ర్యాట‌క‌ప్రాంతాలు కూడా కాలి బూడిద‌య్యాయి. ఈ విష‌యాన్ని బాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు జేమ్స్ వుడ్ త‌న సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు.

దీనికి సంబందించి ఆయ‌న ఓవీడియోను కూడా పంచుకున్నారు. ''ఈ కార్చిచ్చు.. మ‌మ్మ‌ల్ని ద‌హించి వేస్తోంది. మా క‌ల‌ల‌ను నాశ‌నం చేసింది. ఎప్పుడు ఆగుతుందో.. ఎప్పుడు మాకు విశ్రాంతి ల‌భిస్తుందో తెలియ‌డం లేదు'' అని ఆయ‌న రాసుకొచ్చారు. ఈ కార్చిచ్చు ప్ర‌భావంతో జేమ్స్ వుడ్ ఇల్లు స‌హా.. అనేక మంది ప్ర‌ముఖ‌లు ఇళ్లు కూడా ద‌హించుకుపోయాయి. ఎటు చూసినా.. మొండి గోడ‌లు.. మ‌సి ప‌ట్టిన ఇళ్లు.. కాలి బూడిదైన చెట్లు.. ఇలా ఒక ర‌క‌మైన భ‌యాన‌క వాతావ‌ర‌ణం అయితే.. లాస్ ఏంజెల‌స్‌లో క‌నిపిస్తోంది. చాలా మంది త‌మ ఇళ్ల‌కు నిప్పులు అంటుకోకుండా.. ముంద‌స్తుగా నీటితో త‌డుపుకుంటున్న దృశ్యాలు కూడా క‌నిపించాయి.

మ‌రోవైపు ప‌సిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలో కూడా కార్చిచ్చు ఇళ్ల‌ను క‌బ‌ళిస్తోంది. విలాస‌వంత‌మైన వెయ్యికోట్ల రూపాయ‌ల విలువ చేసే భ‌వంతులు కూడా కాలి బూడిద‌గా మారుతున్న దృశ్యాలు మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. మ‌రోవైపు ప‌ర్యాట‌కుల‌కు విలాస‌వంతంగా ఉన్న హోట‌ళ్లు కూడా కాలి బూడిద‌య్యాయి. ఈ కార్చిచ్చు కార‌ణంగా 13 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఆస్తి న‌ష్టం జ‌రిగి ఉంటుంద‌ని 'అక్యూవెదర్' అనే సంస్థ అంచనా వేసింది.

మ‌రోవైపు.. అమెరికా బీమా రంగంపై ఈ కార్చిచ్చు తీవ్ర ప్రభావం చూపించనుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, కాలి బూడిదైన భ‌వ‌నాల్లో ప్ర‌ఖ్యాత లుమినార్ టెక్నాలజీస్ సీఈఓ ఆస్టిన్ రస్సెల్ భ‌వ‌నం కూడా ఉండ‌డంతో ఈ విష‌యం మ‌రింత ఆస‌క్తిగా మారింది. ఈయ‌న ఫైర్ ఫ్రీవుడ్‌తో ఈ ఇంటిని నిర్మించుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయినా.. భ‌వ‌నం కాలి పోయింద‌ని అంటున్నారు.

Tags:    

Similar News