పాక్ ప్రియురాలి కోసం బోర్డర్ దాటబోయాడు.. నెక్స్ట్ జరిగిందిదే!

ఆన్ లైన్ లో పరిచయం అయిన ప్రియుడు / ప్రియురాలి కోసం దేశ సరిహద్దులు దాటేస్తున్న వారి వ్యవహారాలు ఇటీవల మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-26 07:49 GMT

ఆన్ లైన్ లో పరిచయం అయిన ప్రియుడు / ప్రియురాలి కోసం దేశ సరిహద్దులు దాటేస్తున్న వారి వ్యవహారాలు ఇటీవల మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రేమించిన వాడి కోసం భర్తను వదిలి పిల్లలను వెంటపెట్టుకుని పాక్ నుంచి భారత్ వయా దుబాయ్ వచ్చిన వారి కథ ఆ మధ్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో భారత్ లో ఉన్న భర్తను, పిల్లలను, కుటుంబాన్ని వదిలి ఆన్ లైన్ లో పరిచయం అయిన ప్రియుడి కోసం పాక్ కు వెళ్లి, మతం మార్చుకున్న మహిళ వ్యవహారం కూడా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యువకుడు ఆన్ లైన్ లో పరిచయమైన ప్రియురాలి కోసం బోర్డర్ దాటాలని ప్రయత్నించాడు.

అవును... పాకిస్థాన్ లోని తన ప్రియురాలిని కలుసుకునేందుకు అక్రమంగా బోర్డర్ దాటేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. దీంతో... అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాలను కచ్ (వెస్ట్) ఎస్పీ సాగర్ బాగ్మార్ వెల్లడించారు. ఈ సందర్భంగా అతడి మానసిక పరిస్థితి తెరపైకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... జమ్మూకశ్మీర్ కు చెందిన 36 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోఇ తీసుకున్నారు. ఇతడిని ఇంతియాజ్ షేక్ ముల్తాన్ గా గుర్తించారు. అతను బందిపోరా జిల్లా వాసిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ పాకిస్థానీ యువతిని కలుసుకునేందుకు అతడు గుజరాత్ లోని కచ్ జిల్లా ఖవ్రా గ్రామానికి చేరుకున్నాడు.

అక్కడ నుంచి పాక్ వెళ్లేందుకు స్థానికుల నుంచి సహకారం కోరాడు. ఈ వ్యవహారం గురించి స్పందించిన కచ్ ఎస్పీ... ఆన్ లైన్ లో పరిచయమైన యువతిని కలుసుకునేందుకు సరిహద్దు దాటి పాక్ వెళ్లాలని ఇతడు ప్రయత్నించాడని.. అయితే అతనితో ఎటువంటి ముప్పూ లేదని నిర్ధరించుకున్నాక విడుదల చేసినట్లు తెలిపారు!

ఈ సందర్భంగా ఆ యువకుడి మానసిక పరిస్థితి బాగా లేదని.. అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని.. పాకిస్థాన్ లోని ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కు ఆకర్షితుడయ్యాడని అంటున్నారు. గూగుల్ మ్యాప్స్ చూసి కచ్ నుంచి పాక్ వెళ్లాలని ప్రయత్నించాడని తెలిపారు.

Tags:    

Similar News