జనసేన టచ్ లోకి బిగ్ షాట్స్...అక్కడ నుంచే...?
దీనికి సంబంధించి పవన్ నోటి నుంచి తాజాగా వెలువడిన కీలక వ్యాఖ్యలు చూస్తే పెద్ద తలకాయలే జనసే కోసం రంగంలోకి వచ్చారని అంటున్నారు.
జనసేన ఏపీలో 2024లో ఒక బిగ్ నంబర్ తోనే పోటీకి రెడీ అవుతుంది అని అంటున్నారు. పొత్తులు ఉన్నా లేకపోయినా జనసేన నుంచి ఎక్కువ మంది పోటీకి దిగడం ఖాయం. టీడీపీతో పొత్తులు కనుక ఉంటే బిగ్ షాట్స్ కూడా ఆ పార్తీ వైపు చూస్తారు అని అంటున్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులు జనసేనకు టచ్ లోకి వచ్చారని ప్రచారం అయితే సాగుతోంది.
దీనికి సంబంధించి పవన్ నోటి నుంచి తాజాగా వెలువడిన కీలక వ్యాఖ్యలు చూస్తే పెద్ద తలకాయలే జనసే కోసం రంగంలోకి వచ్చారని అంటున్నారు. ఎన్నికలలో డబ్బున్న వారు రావాలి ఎవరిని పార్టీలోకి తీసుకున్నా అడ్డు పెట్టవద్దు అని పవన్ కళ్యాణ్ చాలా నిజాయతీగానే పార్టీ ముఖ్య నేతలకు లేటెస్ట్ గా చెప్పినట్లుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు అవసరమే అని జనసేన గ్రహించింది అంటున్నారు. టికెట్ల కోసం ఎవరి వద్దా జనసేన డబ్బులు అడగదు అని పవన్ చెబుతూనే డబ్బు కూడా అవసరమే అని మాట్లాడటం పట్ల ఇపుడు చర్చ సాగుతోంది. జనసేనలోకి ఎవరు వస్తారు, ఏ పార్టీ నుంచి జంప్ చేస్తారు అన్నదే చర్చకు వస్తున్న విషయం.
నిజానికి జనసేన యాభై దాకా సీట్లను పొత్తులలో భాగంగా టీడీపీని పట్టుబట్టే అవకాశం ఉంది. టీడీపీ అన్ని సీట్లు ఇవ్వకపోయినా పాతిక ముప్పయితో తెగ్గొట్టాలని చూస్తోంది. మరీ పట్టుబడితే నలభైకి ఖాయం చేసుకోవచ్చు అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకున్న జనసేనకు నలభై సీట్లు ఇవ్వడం అంటే అది చాలా పెద్ద విషయమే అని కూడా అంటున్నారు.
ఇక్కడే మరో మాట కూడా ప్రచారంలోకి వస్తోంది. సాధారణంగా టీడీపీ పొత్తులు ఎపుడూ జూనియర్ పార్టనర్స్ తోనే ఉంటూ వచ్చాయి. వారికి అయిదు పది సీట్లు ఇచ్చి నూటికి తొంబై శాతం సీట్లలో టీడీపీ పోటీ చేయడం అలవాటుగా ఉంది. జనసేనకు 40 సీట్లు ఇస్తే కనుక పాతిక శాతం టీడీపీ వదులుకున్నట్లే. ఆ విధంగా డెబ్బై అయిదు శాతం సీట్లలోనే టీడీపీ పోటీ చేస్తున్నట్లు లెక్క.
మరి టీడీపీకి మొత్తం 175 సీట్లలోనూ అభ్యర్ధులు కీలక నాయకులు ఉన్నారు. అలాగే ఆశావహులూ ఉన్నారు. వారిలో బిగ్ షాట్స్ కూడా ఉన్నారు. అమ్రి వారి సంగతేంటి అన్నదే ప్రశ్నగా వస్తోంది. ఇపుడు అలాంటి వారికి జనసేన ఆశాకిరణంగా కనిపిస్తోంది అని అంటున్నారు. అందుకే పవన్ నోట ఎవరు పార్టీలోకి వచ్చినా అడ్డుకోవద్దు అని ఒక మాట వచ్చింది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే టీడీపీకి ఒక వ్యూహం ఎపుడూ ఉంటుంది. పొత్తుల పేరుతో మిత్రులకు సీట్లు ఇవ్వడం, తన పార్టీ నుంచే వారిని ఆ వైపుగా జంప్ చేయించడం అక్కడ నుంచి వారిని పోటీ చేయించి గెలిపించుకోవడం వంటివి ఉంటాయని అంటున్నారు. 2014లో చూస్తే క్రిష్ణా జిల్లాలో కామినేని శ్రీనివాస్ ని బీజేపీ నుంచి పోటీ చేయించి మంత్రిగా కూడా తీసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు.
దీంతో చూస్తూంటే టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన బిగ్ షాట్స్ జనసేనలోకి వస్తారా లేక వైసీపీ నుంచి వస్తారా లేక న్యూట్రల్ గా ఉంటూ రాజకీయాల్లోకి రావాలని చూసే వారికి కొత్త పార్టీగా జనసేన కనిపిస్తుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా జనసేనలోకి కొత్త ముఖాలు రానున్న కాలంలో కనిపించే అవకాశం ఉంది అని అంటున్నారు.