జయప్రదకు బిగ్ షాక్.. ఆరు నెలలు జైలు శిక్ష!
అవును... ఇరుపక్షాల వాదనలు విన్న ఎగ్మోర్ న్యాయస్థానం జయప్రద సహా ముగ్గురికి ఆరు నెలల జైలుశిక్ష విధించడంతోపాటు.
అటు సినిమారంగంలోనూ, ఇటు రాజకీయాల్లో తనదైన ప్రత్యేకతను చాటుతూ గుర్తింపు తెచ్చుకున్న అలనాటి స్టార్ హీరోయిన్, మాజీ ఎంపీ జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు! అయితే ఆమెకు సంబంధించిన ఒక విషయం ఇప్పుడు షాకింగ్ గా ఉంది. దీంతో ఆమె అభిమానులు హర్ట్ అవుతున్నారని తెలుస్తుంది.
అవును... ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు జైలు శిక్ష, జరిమానా విధించింది కోర్టు. కార్మికుల నుంచి ఈ.ఎస్.ఐ. రూపంలో డబ్బులు వసూల్ చేశారని, అనంతరం వాటిని తిరిగి చెల్లించలేదని గతంలో కేసు నమోదైంది. దీంతో జయప్రదతో పాటు మరో ముగ్గురికి శిక్ష ఖరారు చేసింది.
వివరాళ్లోకి వెళ్తే... జయప్రద చెన్నైలోని రాయపేటలో గతంలో ఓ సినిమా థియేటర్ నిర్వహించారు. చెన్నైకు చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి థియేటర్ పనులు చూసుకునేవారు. తొలుత బాగా లాభాలు వచ్చినా తర్వాత రాబడి తగ్గడంతో పాటు థియేటర్ మూసేశారు. ఆ సమయంలో కార్మికుల నుంచి ఈ.ఎస్.ఐ. రూపంలో కొంత డబ్బులు వసూలు చేశారట.
అయితే అనంతరం కొంతకాలం తర్వాత థియేటర్ మూసివేశారట. ఆ సమయంలో కార్మికుల డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉండగా.. వాటిని కార్మికులకు అందజేయలేదట. దీంతో కార్మికులందరూ బీమా కార్పొరేషన్ ను ఆశ్రయించగా.. సదరు బీమా సంస్థ చెన్నై ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించింది.
ఇందులో భాగంగా జయప్రదతో పాటు మరో ముగ్గిరిపై పిటిషన్ దాఖలు చేసింది. కార్మికుల నుంచి వసూలు చేసిన ఈ.ఎస్.ఐ. డబ్బులను తిరిగి వారికి చెల్లించలేదని కోర్టులో పేర్కొంది. అయితే వాటిని కార్మికులకు తిరిగి అందిస్తామని జయప్రద చెప్పినా కోర్టు అంగీకరించలేదు. దీంతో ఆరు నెలల శిక్షను విధిస్తూ చెన్నై ఎగ్మోర్ కోర్టు తీర్పును వెలువరించింది.
అవును... ఇరుపక్షాల వాదనలు విన్న ఎగ్మోర్ న్యాయస్థానం జయప్రద సహా ముగ్గురికి ఆరు నెలల జైలుశిక్ష విధించడంతోపాటు.. ఐదువేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
కాగా... ఎనభై, తొంభై దశకాల్లో జయప్రద ఓ సంచలనం! తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా ఆమె ఓ వెలుగు వెలిగింది. తెలుగు నేలపై పుట్టి హిందీ నాట తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. జితేంద్ర, రిషీ కుమార్ వంటి అగ్ర హీరోలు సైతం అప్పట్లో ఆమె డేట్స్ కోసం వేయిట్ చేసే వారని చెబుతుంటారు.
ఇక తెలుగులోనూ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి పలువురు దిగ్గజాలతో కలిసి నటించి విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత 1994లో తెలుగుదేశం పార్టీలో చేరారు జయప్రద. ఆ సమయంలో టీడీపీ తరపున పలు ప్రచార సభల్లో పాల్గొన్న ఆమె.. తర్వాత కొన్ని ప్రత్యేక కారణాలతో సమాజ్ వాదీ పార్టీలో చేరారు.
అనంతరం 2004 నుండి 2014 వరకు ఆమె ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యురాలిగా కూడా పని చేశారు. ఆ తర్వాత 2019లో బిజెపిలో చేరారు. అలా అటు సినిమా రంగం, ఇటు రాజకీయ రంగంలోనూ జెండా ఎగురవేస్తున్న జయప్రదకు తాజాగా కోర్టు షాక్ ఇచ్చింది!