జాబ్ ఫ్రాడ్.. ఉక్రెయిన్ యుద్ధంలో డేంజరస్ ఆర్మీలో తెలంగాణ యువకుడు

జాబ్ ఫ్రాడ్ లో 22 ఏళ్ల తెలంగాణ వాసి తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ప్రకారం ఉద్యోగం కోసం వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ 22 ఏళ్ల యువకుడు, కర్ణాటకలోని కలబురిగికి చెందిన ముగ్గురు యువకులు రష్యాలో మోసపోయారు.

Update: 2024-02-22 15:30 GMT

సరిగ్గా రెండేళ్లవుతోంది ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలుపెట్టి.. ఉక్రెయిన్ తమ మాట వినకుండా నాటోలో చేరే ప్రయత్నం సాగించడంతో రష్యా అధినేత పుతిన్ కు ఒళ్లు మండింది. కేవలం ఉక్రెయిన్ ను నిరాయుధులను చేస్తామని చెబుతూ దాడులకు దిగాడు.. ఈ రెండేళ్లలో అతడు సాధించింది ఏమీ లేదు. భారీగా ఆయుధాలను సైన్యాన్ని కోల్పోయాడు. అటు ఉక్రెయిన్ ను కోలుకోలేనంతగా నాశనం చేశాడు. తూర్పు ఉక్రెయిన్ లోని డాన్ బాస్ ప్రాంతాన్ని ఆక్రమించాడు. అక్కడ రిఫరెండం పెట్టి తన మద్దతుదారులను గెలిపించుకున్నాడు. మరోవైపు యుద్ధం ఇంకా ఒక కొలిక్కిరాలేదు.

చెట్టుకొకరు.. పుట్టకొకరు ఉక్రెయిన్ యుద్ధంలో తీవ్రంగా ప్రభావితమైనది తూర్పు ప్రాంతం. అక్కడినుంచి లక్షలాది మంది వెళ్లిపోయారు. ఇలాంటివారిలో ఏపీలోని తణుకుకు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ గిరి కుమార్ పాటిల్ కూడా ఒకరు. అంతకుముందు క్రిమియా యుద్ధంలో సర్వం కోల్పోయిన ఈయన.. అక్కడినుంచి వచ్చేసి స్వాతవో అనే ప్రాంతంలో స్థిరపడ్డారు. ఆర్థికంగా కోలుకుని ఆస్తులు కూడబెట్టుకుని.. జాగ్వార్ వంటి అరుదైన చిరుతను పెంచుతూ వచ్చారు. అలాంటాయన రెండోసారి యుద్ధంతో ఇంటిని వదిలేసి వెళ్లిపోయారు. ఎంతో ఇష్టంగా పెంచుకున్న జాగ్వార్, నల్ల చిరుతలను రష్యా తరలించారు. మరోవైపు ఉక్రెయిన్ లో వైద్య విద్య చదువుతున్న వందల మంది భారతీయులు యుద్ధం కారణంగా ఆ దేశాన్ని వీడి వచ్చేశారు.

జాబ్ ఫ్రాడ్ లో 22 ఏళ్ల తెలంగాణ వాసి తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ప్రకారం ఉద్యోగం కోసం వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ 22 ఏళ్ల యువకుడు, కర్ణాటకలోని కలబురిగికి చెందిన ముగ్గురు యువకులు రష్యాలో మోసపోయారు. వీరంతా ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. ఫేక్ ఆర్మీ జాబ్ రాకెట్ వలలో పడి వీరు రష్యాకు వెళ్లారు. అనంతరం రష్యా తరఫున బలవంతంగా యుద్ధంలోకి దింపారు. భారీగా జీతం ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెబుతూ వీరిని యుద్ధంలోకి తోసినట్లు తెలుస్తోంది. అయితే, ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేయలేక ఈ నలుగురూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఇంగ్లిష్ మీడియాలో వచ్చింది.

అత్యంత ప్రమాదకర వాగ్నర్ ఆర్మీలో తెలంగాణ యువకుడు, కర్ణాటక వారిని అత్యంత ప్రమాదకర గ్రూప్ అయిన వాగ్నర్ గ్రూప్ లో చేర్చినట్లు సమాచారం. వాగ్నర్ గ్రూప్ అంటే.. కిరాతకానికి మారు పేరు. దీని అధినేత ఏకంగా యొవ్ గెని ప్రిగోజిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మీదనే తిరుగుబాటు చేసి హతుడయ్యాడు. అలాంటి వాగ్నర్ గ్రూప్ లో తెలంగాణ యువకుడిని బలవంతంగా తోసి యుద్ధానికి పంపడం గమనార్హం.

Tags:    

Similar News