రష్యా నుంచి కొనుగోలు చేసిన ముడిచమురు లెక్కలు బయటకు

రష్యా నుంచి భారీగా ముడిచమురు కొనుగోలు చేసిన దేశాల్లోచైనా 235 బిలియన్ యూరోల ఇందనాల్ని కొనుగోలు చేసింది. భారత్ 205.84బిలియన్ యూరోల ఇంధనాల్ని కొనుగోలు చేసింది.;

Update: 2025-03-09 05:30 GMT

ఉక్రెయిన్ తో సాగుతున్న యుద్ధం వేళ రష్యా మీద పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించటం తెలిసిందే. దీంతో.. రష్యా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురైంది. ఇలాంటి వేళ.. రష్యా నుంచి భారీ ఎత్తున ముడిచమురును తక్కువ ధరకు మన దేశం కొనుగోలు చేయటం తెలిసిందే. ఈ కొనుగోలుకు సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఉక్రెయిన్ తో యుద్ధం ఆరంభం నుంచి ఇప్పటివరకు రష్యా నుంచి భారత్ దాదాపు 112.5 బిలియన్ యూరోల ముడిచమురును కొనుగోలు చేసినట్లుగా సెంట్రల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ఒక రిపోర్టులో వెల్లడించింది.

మన రూపాయిల్లో చెప్పాలంటే ఇది రూ.1.5 లక్షల కోట్లతో సమానం. ఇందులో శిలాజ ఇంధనాలకు సంబంధించి రష్యాకు లభించిన చెల్లింపు వివరాలు ఇందులో ఉన్నాయి. యుద్ధం ఆరంభం నుంచి రష్యా శిలాజ ఇంధన ఎగుమతుల ద్వారా 835 బిలియన్ యూరోల ఆదాయాన్ని ఆర్జించింది. రష్యా నుంచి భారీగా ముడిచమురు కొనుగోలు చేసిన దేశాల్లోచైనా 235 బిలియన్ యూరోల ఇందనాల్ని కొనుగోలు చేసింది. భారత్ 205.84బిలియన్ యూరోల ఇంధనాల్ని కొనుగోలు చేసింది.

ఇలా కొన్న ఇంధనాల్లో బొగ్గు.. గ్యాస్.. ముడి చమురు ఉన్నాయి. యుద్ధం కారణంగా విధించిన ఆంక్షలతో రష్యా చమురు చౌకగా లభిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున కొనుగోళ్లు చేపట్టింది. దీంతో చౌకగా ఇంధనాలు లభించాయి. అయితే..ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చిందంటున్నారు. అప్పట్లో బ్యారెల్ కు 18 - 20 శాతం వరకు రాయితీ లభించగా.. ఇప్పుడు మాత్రం మూడు శాతం మాత్రమే రాయితీ లభిస్తున్నట్లుగా వెల్లడైంది.

Tags:    

Similar News