బైడెన్ వర్సెస్ ట్రంప్ ముఖాముఖి.. అధిక్యత ఎవరిది?

మొత్తం చర్చలో ట్రంప్ 23 నిమిషాల ఆరు సెకన్లు మాట్లాడితే..బైడెన్ 18 నిమిషాల 26 సెకన్లు తీసుకున్నారు. చర్చలో ట్రంప్ పైచేయి సాధించినట్లుగా సదరు చానల్ నిర్వహించిన పోల్ లో వీక్షకులు తమ తీర్పును ఇవ్వటం గమనార్హం.

Update: 2024-06-28 09:00 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత తొలిసారి ముఖాముఖి చర్చలో తలపడిన అగ్రనేతల మధ్య మాటలు పోటాపోటీగా సాగాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ఆయన చేతిలో గత ఎన్నికల్లో ఓటమిపాలైన ట్రంప్ లు ఇద్దరి మధ్య వాడీవేడీగా చర్చ సాగింది. అట్లాంటాలోని సీఎన్ఎన్ ప్రధాన కార్యాలయం వీరిద్దరి సంవాదానికి వేదికగా మారింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఈ ముఖాముఖి చర్చ జరిగింది. చర్చ మొత్తాన్ని సింఫుల్ గా ఒక్క లైన్ లో చెప్పాలంటే.. ట్రంప్ చెలరేగిపోతే.. బైడెన్ ఆయన వాగ్ధాటి ముందు తేలిపోయిన పరిస్థితి.

చర్చలో భాగంగా వాడీ వేడీ వాదనలు ఒక దశ దాటిన తర్వాత ఇరువురు అగ్రనేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు గుప్పించుకున్నారు. వ్యక్తిగత విమర్శలకు సైతం వెనుకాడలేదు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ చెలరేగిపోతే.. అప్పుడప్పుడు అధ్యక్ష బైడెన్ మాత్రం తడబడిన పరిస్థితి. బైడెన్ ను ఫెయ్యిలూర్ గా ట్రంప్ పేర్కొంటే.. తనను నిందిస్తున్న ట్రంప్ కు కౌంటర్ గా ట్రంప్ ను దోషిగా అభివర్ణించారు. చర్చలో నిర్వాహకులు తప్ప ఇంకెవరు లేరు. ఈసారి ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరి మైక్ ను కట్ చేశారు.

Read more!

మొత్తం చర్చలో ట్రంప్ 23 నిమిషాల ఆరు సెకన్లు మాట్లాడితే..బైడెన్ 18 నిమిషాల 26 సెకన్లు తీసుకున్నారు. చర్చలో ట్రంప్ పైచేయి సాధించినట్లుగా సదరు చానల్ నిర్వహించిన పోల్ లో వీక్షకులు తమ తీర్పును ఇవ్వటం గమనార్హం. ఈ ముఖాముఖి చర్చ గురించి మాట్లాడిన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సైతం.. బైడెన్ చర్చను నెమ్మదిగా ప్రారంభించినట్లు వ్యాఖ్యానించటంగమనార్హం.

చర్చలో భాగంగా దేశ ఆర్థిక వ్యవస్థ.. విదేశాంగ విధానం.. వలసలు.. ఇజ్రాయల్.. హమస్ యుద్ధంపై ఇరువురు అగ్రనేతలు మాట్లాడారు. సంపన్నులకు అనుకూలంగా ట్రంప్ విధానాలు ఉన్నాయని బైడెన్ ఆరోపించగా.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని.. నిరుద్యోగం 15 శాతానికి చేరిందని ట్రంప్ మండిపడ్డారు. బైడెన్ హయాంలో కేంద్రం అక్రమ వలసదారులకు మాత్రమే ఉద్యోగాలు లభించాయని తీవ్ర ఆరోపణ చేశారు. ద్రవ్యోల్బణం.. పన్ను కోతల వల్ల ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తగిలినట్లుగా పేర్కొన్నారు.

విదేశాంగ విధానంపై బైడెన్.. ట్రంప్ మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ దారుణంగా సాగినట్లుగా ట్రంప్ మండిపడితే.. తన హయాంలో చాలా గౌరవప్రదంగా సైనికులు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లుగా బైడెన్ పేర్కొన్నారు. ట్రంప్ హయాంలోనే తాలిబన్లు అమాయకపు అఫ్ఘాన్ అన్నలను చంపినట్లుగా పేర్కొన్న బైడెన్.. అమెరికా సైనికులు సైతం ఆయన్ను నిందించారన్నారు.

ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ కు ట్రంప్ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని.. రష్యా ప్రతిదాడిని సమర్థిస్తున్నట్లుగా ఆరోపించారు. అక్రమ వలసదారులను ఆహ్వానిస్తున్నట్లుగా పేర్కొన్నారు. దేశ దక్షిణ సరిహద్దుల్నిసురక్షితంగా ఉంచటంలో బైడెన్ ఫెయిల్ అయినట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. గర్బ విచ్ఛిత్తి నిషేధాన్ని బైడెన్ తప్పు పట్టారు. దీనికి వైద్యులకు.. మహిళలకే వదిలేయాలని.. రాజకీయ నాయకులు ఈ అంశాలపై చర్చించాల్సి ఉందన్నారు. ఇజ్రాయల్ - హమస్ యుద్ధంలోనూ ఇరువురు ఇజ్రాయల్ మద్దతుగా నిలిచారు. యద్ధం బాధ్యత హమస్ దేనని బైడెన్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న అంశంపై ఇరువురు అగ్రనేతలు ఒకే మాట మీద నిలవటం విశేషం.

అఫ్టాన్ సైనికులు సామాన్య పౌరుల్ని చంపుతూనే ఉన్నారన్న ట్రంప్.. దీనికి అమెరికా అధ్యక్షుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉక్రెయిన్ - రష్యా గురించి మాట్లాడిన బైడెన్.. ట్రంప్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అనేక మంది సైనికుల ప్రాణాలు కోల్పోయినందుకే రష్యా ప్రతిదాడి చేస్తోందని సమర్థించారు. దీనికి ట్రంప్ ఖండించారు. వలస విధానంపై ట్రంప్ కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బైడెన్ తెలిపారు.

అక్రమ వలసదారులను తాము ఆహ్వానిస్తున్నామన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.ఇదే అంశంపై ట్రంప్ మాట్లాడుతూ.. దేశ దక్షిణ సరిహద్దులను భద్రంగా ఉంచే విషయంలో బైడెన్ ఫెయిల్ అయ్యారన్నారు. ఇది బైడెన్ చేసిన నేరంగా తాను పేర్కొంటానన్నారు. ఇజ్రాయెల్ కు తమ మద్దతు ఉంటుందని బైడెన్ స్పష్టం చేశారు. ఘర్షణలకు హమాస్ దే పూర్తి బాధ్యతగా బైడెన్ పేర్కొన్నారు. ఆసక్తికరంగా ట్రంప్ సైతం ఈ అంశంలో మాత్రం ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచారు. బైడెన్ వైఖరిలో మార్పు వచ్చిందని.. పాలస్తీనావాదిగా మాట్లాడుతున్నట్లు ఆరోపించారు. గర్భ విచ్ఛిత్తి నిషేధాన్ని బైడెన్ తప్పుపడితే.. ట్రంప్ మాత్రం దీన్ని తేల్చాల్సింది వైద్యులే తప్పించి రాజకీయ నాయకులు కాదని పేర్కొనటం గమనార్హం.

Tags:    

Similar News

eac