బాలయ్య ఇంటి ముందు కారు బీభత్సం.. అసలేం జరిగిందంటే?
వీకెండ్ లేదా ఫెస్టివల్ సమయం వస్తే, వాహనదారులు అతివేగంగా వాహనాలు నడిపిస్తూ ప్రమాదకరంగా ప్రవర్తిస్తుంటారు.;
వీకెండ్ లేదా ఫెస్టివల్ సమయం వస్తే, వాహనదారులు అతివేగంగా వాహనాలు నడిపిస్తూ ప్రమాదకరంగా ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు ఈ అతివేగం ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుంది.
తాజాగా శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లో ఓ కారు నియంత్రణ కోల్పోయి బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్-1లో సినీ నటుడు బాలకృష్ణ ఇంటి ఎదుటున్న ఫుట్‌పాత్‌పైకి వేగంగా దూసుకెళ్లి ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ప్రమాదాన్ని చూసిన వాకర్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొద్దిక్షణాల్లోనే తాము ప్రమాదం నుంచి తప్పించుకున్నామని, లేకుంటే విషాదం జరిగి ఉండేదని చెబుతున్నారు.
డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు గుండా చెక్‌పోస్ట్ వైపు వెళ్తుండగా కారు అదుపుతప్పి ప్రమాదం జరిగింది.
కారును అతివేగంగా దూసుకొస్తుండగా చూసినవారు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో బాలకృష్ణ ఇంటి ముందు ఉన్న ఫెన్సింగ్ ధ్వంసమవ్వగా, కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలైనట్లు సమాచరం.
ఈ విషయం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.