బాబుకు జడ్జిమెంట్ డే : అలెర్ట్ అయిన వైసీపీ...!

అనూహ్యమైన పరిణామాలు జరిగి బాబు క్వాష్ పిటిషన్ మీద అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం ఏపీలో రాజకీయం వేరే రూపు తీసుకుంటుంది.

Update: 2023-10-20 03:58 GMT

ఈ ఫ్రైడే ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తుందా అన్నది కొద్ది గంటలలో తేలనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ మీద సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ ఉంది. ఒక విధంగా ఇరు పక్షాల నుంచి లిఖితపూర్వకమైన వాదనలు తీసుకున్న మీదట సుప్రీం కోర్టు తీర్పుని ప్రకటిస్తుందా అన్న చర్చ అయితే ఉంది.

టీడీపీలో ఈ విషయం మీద సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. మరో వైపు చూస్తే వైసీపీ కూడా జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది అంటున్నారు. శుక్రవారం ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా తగిన విధంగా వ్యవహరించాలని వైసీపీ భావిస్తోంది అని అంటున్నారు.

అనూహ్యమైన పరిణామాలు జరిగి బాబు క్వాష్ పిటిషన్ మీద అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం ఏపీలో రాజకీయం వేరే రూపు తీసుకుంటుంది. టీడీపీ రెట్టించిన ఉత్సాహంతో ఏపీలో లా అండ్ ఆర్డర్ కి ఏమైనా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నది కూడా ప్రభుత్వం కూడా భావిస్తోంది అంటున్నారు.

ఈ మేరకు అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటోందని అంటున్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కోర్టులో కనుక నెగ్గితే మాత్రం టీడీపీని పట్టపగ్గాలు ఉండవు. చంద్రబాబు నిప్పు అంటూ ఏపీలో టీడీపీ అదిరిపోయే లెవెల్ లో ఆందోళనలు చేపట్టినా చేస్తుందని అంటున్నారు.

గత నెలన్నరగా టీడీపీ శ్రేణులలో పేరుకుపోయిన ఫ్రస్ట్రేషన్ కూడా ఇపుడు కొత్త టర్న్ తీసుకునే సూచనలు ఉన్నాయని అంటున్నారు. దాంతో లా అండ్ ఆర్డర్ మీద ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే క్వాష్ పిటిషన్ కొట్టేస్తే ఏం చేయాలన్న దాని మీద కూడా టీడీపీ లో చర్చ సాగుతూంటే క్వాష్ పిటిషన్ ని ఓకే చేస్తే ఏమి చేయాలన్న దాని మీద వైసీపీలో చర్చ సాగుతోంది.

అయితే క్వాష్ పిటిషన్ వ్యవహారం సుప్రీం కోర్టులో శుక్రవారం తేలుతుందా జడ్జిమెంట్ ఇస్తారా లేక దసరా సెలవుల తరువాత వరకూ వాయిదా వేస్తారా అన్నది చూడాలని అంటున్నారు. ఇక చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి కోరుతున్నారు.

దాని మీద కూడా కోర్టు విచారించనుంది. బాబు ఏజ్ ఆయన అనారోగ్యకరమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కోర్టు కనుక బిగ్ రిలీఫ్ ఇస్తే అపుడు కూడా టీడీపీకి భారీ విక్టరీ లభించినట్లే అంటున్నారు. ఏ విధంగా చూసినా శుక్రవారం అందరి చూపూ సుప్రీం కోర్టు మీదనే ఉన్నాయని అంటున్నారు. ఈ ఫ్రై డే ఎలా ఉండబోతోంది అన్నది మాత్రం ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాల మధ్య చర్చగా మారుతోంది.

Tags:    

Similar News