తీహార్ జైలులో కవితకు సదుపాయాలు ఎందుకు అందడం లేదు?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వ్యవహారంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వ్యవహారంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు ఈడీ ఆధీనంలో ఉన్న ఆమెను తీహార్ జైలుకు తరలించారు. అక్కడ తనకు సరైన సదుపాయాలు లేవని ఆమె రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ మద్యం కేసులో ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 15న ఈడీ కస్టడీలో ఉన్న ఆమెను ఇటీవల తీహార్ జైలుకు 14 రోజుల రిమాండ్ కు తరలించారు.
ఈడీ ఆధీనంలో ఉన్నప్పుడు ఆమెకు అన్ని సదుపాయాలు కల్పించారు. ఇంటి భోజనం అనుమతించారు. తన బంధువులను కలిసేందుకు అనుమతి ఇచ్చారు. లాయర్లతో భేటీకి సమ్మతించారు. కానీ ఇప్పుడు కొన్ని ఆక్షేపణలు పెడుతుండటంతో ఆమె రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది. లేనిపోని షరతులు పెడుతున్నారని చెబుతోంది.
ఇంటి భోజనం రానివ్వడం లేదు. పరుపులు, చెప్పులు, దుస్తులు, బెడ్ షీట్లు, పుస్తకాలు అనుమతించడం లేదు. కనీసం కళ్ల జోడు కూడా ఇవ్వడం లేదు. జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. నాకు అవసరమయ్యే సామగ్రి అందనీయడం లేదు పెన్నులు, పేపర్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.
తనకు కావాల్సిన వస్తువులు సమకూర్చుకునేందకు అవకాశం ఇప్పించండి. కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా అవకాశం లేదా? అని ప్రశ్నించింది. తనను బందీలా చూస్తే ఊరుకోనని సూచించింది. చట్ట పరంగా తనకు కావాల్సిన అవసరాలు తీర్చుకునే వెసులుబాటు లేదా అని ప్రశ్నిస్తోంది. జైలు సూపరింటెంటెండ్ ఆదేశించి తనకు వస్తువులు ఇప్పించాలని కోరుతోంది.
దీంతో కవిత అభ్యర్థనను కోర్టు స్వీకరిస్తుందా? తీహార్ జైలు అంటే దేశంలోనే పేరుమోసిన జైలు. అక్కడ వారు చెప్పిందే పాటించాలి. కానీ మన ఇష్టానుసారం కావాలంటే కుదరదు. ఈనేపథ్యంలో కవిత పెట్టుకున్న అవసరాలను తీరుస్తారా? లేక వారి నిబంధనలకు లోబడే కవిత ఉండాల్సిన అవసరం ఉంటుందా? అనేది తేలాల్సి ఉంది.