'ఎమర్జెన్సీ' పై తెలంగాణలో నిషేధం తప్పదా?
బాలీవుడ్ నటి కంనగా రనౌత్ నటించిన `ఎమర్జెన్సీ` రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ నటి కంనగా రనౌత్ నటించిన `ఎమర్జెన్సీ` రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు కంగన అధికారికంగా ప్రకటించింది. కంగన స్వీయా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తలపెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఈ సినిమా వివాదాస్పదంగా ఉండే అవకాశం ఉండటంతో రిలీజ్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
మాజీ ప్రధానీ ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సందర్భాన్ని ..ఆ సమయంలో ఇందులో ఎదుర్కున్న అసమానతల్ని సినిమాలో చూపించనున్నారు. దీంతో సినిమా రిలీజ్ ఆపాలంటూ శిరోమణి అకాలీదళ్ దిల్లీ పార్టీ సీబీఎఫ్ సీని కోరింది. చరిత్రకు సంబంధించిన వాస్తవాలను తప్పుగా చిత్రీకరించి ప్రేక్షకుల్లో ద్వేషాన్ని పెంపోందించేలా ఈ చిత్రం ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు పరమ జిత్ సింగ్ సర్నా బోర్డ్ కు ఓ లేఖ రాసారు.
`సినిమాలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ద్వేష పూరిత కంటెంట్ ని ప్రచారం చేయకుండా ఆపాలి` అని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిక్కు సంఘం నాయకులకు నిలిపివేత విషయంలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
న్యాయపరమైన సంప్రదింపులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. మాజీ ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి 18 మంది బృందం సెక్రటేరియట్‌లో షబ్బీర్‌ను కలిసి ఎమర్జెన్సీ స్క్రీనింగ్‌పై నిషేధం విధించాలని కోరారు. అభ్యర్థించింది. సిక్కులను తీవ్రవాదులుగా , దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని, తమ కమ్యూనిటీ ఇమేజ్ ని దెబ్బ తీసే సినిమాలో కంటెంట్ ఉంటుదని ఆందోళ వ్యక్తం చేసారు.
దీంతో తెలంగాణలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని షబ్బీర్ ముఖ్యమంత్రిని అభ్యర్థిం చారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. అలాగే సినిమాలో కొన్ని పాత్రల విషయంలో నేరుగా కంగనని కొంత మంది చంపేస్తామంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే.