ఏపీలో దాడులపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్!

ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో రాజకీయ దాడులు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-06-08 09:02 GMT

ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో రాజకీయ దాడులు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. పట్టపగలు నడిరోడ్డుపై కత్తితో దాడి చేస్తున్న సంఘటనలు ఏపీలో దర్శనమిస్తున్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నా.. లైక్ కొట్టి షేర్ కొడుతున్నట్లుగా పరిస్థితి మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఏపీలో జరుగుతున్న ఘర్షణ వాతావరణంపై కేఏ పాల్ స్పందించారు.

అవును... ఏపీలో జరుగుతున్న రాజకీయ ప్రతీకార దాడులపై కేఏ పాల్ స్పందించారు. ఇందులో భాగంగా... "చంద్రబాబు గారూ మన రాష్ట్రం ఏమవుతుంది? ఈ వయసులో కూడా మీరు టీడీపీ కార్యకర్తలకు బుద్ది చెప్పలేరా?" అని మొదలుపెట్టిన పాల్... టీడీపీ ఎలా గెలిచిందో, ఈవీఎంలను ఎలా ట్యాపరింగ్ చేశారో మీకు తెలుసు, నాకు తెలుసు, జగన్ కు తెలుసని కాకపోతే... కార్యకర్తలకు తెలియదని అన్నారు.

ఈ సందర్భంగా లా & ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతే ఆరు నెలల్లో ముఖ్యమంత్రిగా ఉండలేరని పాల్ చెప్పుకొచ్చారు. ఏపీని అభివృద్ధివైపు నడిపించేలా ముందుకు కదలాలని.. ప్రత్యేక హోదా తెచ్చుకోవాలని.. మోడీపై ఒత్తిడి పెడుతున్నామని పాల్ తెలిపారు. ఇదే సమయంలో పరిస్థితి ఇలానే కొనసాగితే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పాల్ హెచ్చరించారు.

ఈ సందర్భంగా... మోడీకి పాఠాలు చెప్పాల్సిన చంద్రబాబు.. టీడీపీ కార్యకర్తలు, పిల్లలు ఇలా దిగజారిపోతుంటే, వారిని ఆపలేకపోతే.. ప్రజల చేత ఛీ అనిపించుకోకండి అని తెలిపారు.. చరిత్ర హీనులు కాకండి అని హితవు పలికారు. ఈ సందర్భంగా కక్షపూరిత రాజకీయాలు ఆపేసి, రాష్ట్రాన్ని బాగుచేసుకుందామని పాల్ తెలిపారు.

Tags:    

Similar News