వివాహ వ్యవస్థలో "మ్యారేజ్ డిటెక్టివ్" అనే కొత్త ట్రెండ్!
ఈ గ్యాప్ లో లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనే పద్దతి ఎంట్రీ ఇచ్చి.. చాప కింద నీరులా వ్యాపిస్తుందని అంటున్నారు.
గతంలో పెళ్లి సంబంధాలు అంటే... మ్యాగ్జిమం మేనరికాలు చూసుకునేవారు.. కానిపక్షంలో తెలిసినవారి ద్వారా వచ్చిన సంబంధాలు చేసుకునేవారు.. అప్పటికీ కానిపక్షంలో పెళ్ళిళ్ల పేరయ్యలకు ఆ బాధ్యతలు అప్పగించేవారు. తర్వాతి కాలంలో ప్రేమ పెళ్లిల్లు ఎంట్రీ ఇచ్చాయి. ఆనాక.. మ్యారేజ్ బ్యూరోలు, ఆన్ లైన్ లో పెళ్లి చూపుల ట్రెండ్ వచ్చింది.
ఈ గ్యాప్ లో లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనే పద్దతి ఎంట్రీ ఇచ్చి.. చాప కింద నీరులా వ్యాపిస్తుందని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ప్రస్తుత కాలంలో తాజా ఓ కొత్త ట్రెండ్ తెరపైకి వచ్చిందని తెలుస్తోంది. ఇది ముందు జాగ్రత్తా, అతి జాగ్రత్త లేక మరేదైనానా అనే సంగతి కాసేపు పక్కన పెడితే... ఇప్పుడు ఈ ట్రెండ్ వైరల్ గా మారుతోందని అంటున్నారు.
అవును... ప్రస్తుతం భారత్ లో వివాహ వ్యవస్థలో "మ్యారేజ్ డిటెక్టివ్" అనే కొత్త ట్రెండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయంలో ఢిల్లీకి చెందిన భావనా పాలివాల్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారని అంటున్నారు. ఈ సర్వీసు ఛార్జెస్ రూ.50వేల నుంచి రూ.లక్ష వరకూ ఉంటాయని అంటున్నారు. ఈ సమయంలో వివాహ వ్యవస్థలో వీటి అవసరం ఎంతనేది ఆసక్తిగా మారింది.
రవితేజ నటించిన డాన్ శీను సినిమాలో విలన్ చెల్లి వివాహం విషయంలో వారి వద్ద పనిచేసే 'విశ్వాస్' (బ్రహ్మానందం) ను డిటెక్టివ్ గా పంపుతాడు మరో విలన్. ఆ సన్నివేశాలు సినిమాలో సరదాగా ఉండొచ్చు కానీ... ఇప్పుడు నిజజీవితంలో ఈ తరహా 'విశ్వాస్' ల ట్రెండ్ పెరిగిందని అంటున్నారు.
వివాహం చేసుకోబోయే యువతి/యువకుడికి సంబంధించిన విషయాలు... జీతం, అలవాట్లు, గత బంధాలు, సమాజంలో ఉన్న పేరు, ఇప్పటికే చెప్పిన విషయాల్లో ఏమైనా విషయాలు దాచిపెట్టారా మొదలైన విషయాలను వీరు పరిశీలిస్తారని అంటున్నారు. ప్రధానంగా విదేశీ సంబంధాలపైనా వీరు దృష్టి పెడుతున్నారని అంటున్నారు.
అయితే వివాహ వ్యవస్థ అనేదే పూర్తిగా నమ్మకంపై ఆధారపడి ఉంటుందని ఒకరంటే... పెళ్లికి ముందే పుర్తి విషయాలు కన్నుక్కుంటే తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదనేది చాలా మంది అభిప్రాయంగా ఉందని అంటున్నారు. దీని వల్ల.. వివాహం అనంతరం వచ్చే సమస్యల సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇక ఈ వివరాలు సేకరించడం కోసం డిటెక్టివ్ లు కెమెరాలు, జీపీఎస్ ట్రాకర్లు, మైక్రో మైక్ లు మొదలైనవి ఉపయోగిస్తారని అంటున్నారు. ఇలా మొదలైన ఆప్షన్స్ ఎంచుకుని.. సదరు యువతి/యువకుడి వివరాలను రహస్యంగా తెలుసుకుంటారని చెబుతున్నారు.
అయితే... డిటెక్టివ్ లు వాస్తవాలు తెలియజేస్తారు కానీ... వివాహ బంధం నిలబడేది, బలపడేది.. ప్రేమ, నమ్మకాల వల్లే అనేది చాలా మంది చెప్పేమాట. పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లై తర్వాత మార్పు వస్తే చేయగలిగేదేమీ లేదనేది మరొకరి మాట! ఏది ఏమైనా... మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అనే విషయం చాలా మంది గుర్తుపెట్టుకుని వివాహ వ్యవస్థ కొనసాగాలని చాలా మంది భావిస్తున్నారని అంటున్నారు!