బొత్స తమ్ముడుకి కరణంతో రణం...?

విజయనగరం జిల్లాలో గజపతినగరం సీటుకు చాలా ప్రాధాన్యత రాజకీయంగా ఉంది. విజయనగరాన్ని ఆనుకునే ఈ సీటు ఉంటుంది

Update: 2023-09-09 03:57 GMT

విజయనగరం జిల్లాలో గజపతినగరం సీటుకు చాలా ప్రాధాన్యత రాజకీయంగా ఉంది. విజయనగరాన్ని ఆనుకునే ఈ సీటు ఉంటుంది. ఇక్కడ టీడీపీ అయిదు సార్లు గెలిస్తే కాంగ్రెస్ మూడు సార్లు గెలిచింది. 2019లో వైసీపీ గెలిచింది. బేసికల్ గా చూస్తే టీడీపీకి కంచుకోట లాంటి సీటు ఇది. అయితే సరైన క్యాండిడేట్లు లేకపోవడం వర్గ పోరు వల్లనే ఈ సీటు చేజారుతోంది. ఇక కొండపల్లి అప్పలనాయుడు 2014లో టీడీపీ తరఫున గెలిచారు. 2019లో ఓడిపోయారు.

ఇపుడు చూస్తే ఆయనకు టికెట్ డౌట్ లో పడింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా క్యాడర్ కి పెద్దగా పట్టించుకున్నది లేదని అంటున్నారు. దాంతో పాటు సీనియర్ నేత కరణం శివరామక్రిష్ణ ఇక్కడ నుంచి పోటీకి అంతా రెడీ చేసి పెట్టుకున్నారు. ఆ మధ్య చంద్రబాబు జిల్లా టూర్ లో ఆయనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆయన గతంలో మూడు సార్లు టికెట్ కోసం ప్రయత్నం చేసినా అధినాయకత్వం ఇవ్వలేదు.

అయినా ఆయన పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారని, విధేయత చూపారన్నది ప్లస్ పాయింట్ అవుతోంది. దాంతో పాటు క్యాడర్ తో సన్నిహితంగా ఉండడం, వైసీపీని ధీటుగా ఎదుర్కోవడంతో టీడీపీ హై కమాండ్ ఆయనకే టికెట్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అంటున్నారు. కొండపల్లి వర్గీయులు కూడా ఆశలు వదులుకోవడంలేదు. తమ నేతకే టికెట్ అంటున్నారు. కానీ కొండపల్లి అప్పలనాయుడు ఒంటెద్దు పోకడలే ఆయనకు ఈసారి సీటు రాకుండా చేస్తున్నాయని అంటున్నారు.

ఇక 2009లో తొలిసారిగా కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి గెలిచిన బొత్స సత్యనారాయణ తమ్ముడు బొత్స అప్పలనాయుడు 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా 44 వేల ఓట్లకు పైగా తెచ్చుకుని సత్తా చాటారు. అందుకే ఆయనను వైసీపీలోకి తీసుకుని టికెట్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో బొత్స అప్పలనరసయ్య ఏకంగా 27 వేల పై చిలుకు మెజారిటీతో అప్పలనాయుడి మీద గెలిచారు ఈసారి ఆ మెజారిటీ ఎంతో కొంత తగ్గినా తనదే విజయం అని బొత్స తమ్ముడు ధీమాగా ఉన్నారు.

అయితే కొండపల్లికి టికెట్ ఇస్తే బొత్స బ్రదర్ కి విజయం ధీమా ఏమో కానీ ఇపుడు కొత్త ముఖంగా కరణం శివరామక్రిష్ణ బరిలోకి దిగుతున్నారు. ఆయన బలమైన క్యాండిడేట్ గా ఉన్నారు. దాంతో బొత్స తమ్ముడికి గజపతినగరంలో ఆయనతో భీకర రణం తప్పకపోవచ్చు అని అంటున్నారు. ఈ ఇద్దరు మధ్యన హోరాహోరీ పోటీగా ఈ సీటు ఉంటుందని అంటున్నారు. గజపతినగరంలో ఈ రోజుకీ వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఇక కరణానికి కొండపల్లి వర్గం సహకారం కూడా అవసరం పడుతుంది. మొత్తం మీద చూస్తే బొత్స తమ్ముడుకి టఫ్ ఫైట్ ఇచ్చేందుకు టీడీపీ కరణాన్ని నమ్ముకుంది అని అంటున్నారు. ఆయన మ్యాజిక్ ఏంటో చూడాల్సిందే అంటున్నారు.

Tags:    

Similar News