తండ్రి కేసీఆర్ ను హగ్ చేసుకున్న కవిత... వీడియో వైరల్!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆరెస్స్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సుమారు 5 నెలలుపైగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-29 09:32 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆరెస్స్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సుమారు 5 నెలలుపైగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మంగళవారం ఆమెకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో ఆమె హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తన తండ్రి కేసీఆర్ ను కలిశారు కవిత.

అవును.. ఐదు నెలలకు పైగా తీహార్ జైల్లో ఉన్న కవితకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి కవిత చేరుకున్నారు. భర్త, కుమారునితో కలిసి ఆమె తన తండ్రి వద్దకు వచ్చారు.

ఈ సమయంలో అక్కడ సిబ్బంది కవితకు దిష్టి తీసి ఇంట్లోకి స్వాగతం పలికారు. ఈ సమయంలో కవితను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన కవిత.. తొలుత కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. ఈ సందర్భంగా కవిత తన తండ్రిని కౌగిలించుకుని ఓదార్పు పొందారు!

ఈ సమయంలో కేసీఆర్ లో కొత్త ఉత్సాహం కనిపించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన నివాసంలో సంబరాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 10 రోజుల పాటు కవిత తన తండ్రి నివాసంలోనే ఉండనున్నారని అంటున్నారు. పది రోజుల తర్వాతే అందరికీ అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు.

కాగా... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. దీంతో సుమారు ఐదు నెలలకు పైగా తీహార్ జైల్లో ఉన్న ఆమె మంగళవారం విడుదలయ్యారు. ఈ కేసులో ఇన్ని రోజుల తర్వాత కవితకు కండిషన్స్ తో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది.

Tags:    

Similar News