అవమాన భారంతో కేసీయార్...అందుకే అలా..

ఆయన ఎన్ని సార్లు ఉప ఎన్నికలు తెచ్చినా ఓటేసి గెలిపించారు అలా బలమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కేసీయార్ అనేక సార్లు ఢీ కొట్టారు.

Update: 2023-12-04 00:30 GMT

తెలంగాణాకు కేరాఫ్ గా మారి రెండున్నర దశాబ్దాల ఉద్యమ జీవితం రాజకీయ జీవితం అంతా బిజీగా గడిపారు కేసీయార్. ఆయన 2001 నుంచి మొదలెట్టిన పరుగుకు 2023లో అతి పెద్ద బ్రేక్ పడింది. ఈ మధ్యకాలం అంతా కేసీయార్ కి ఎదురు లేని పరిస్థితి. ఆయన వ్యూహాలకు ఎపుడూ తిరుగులేదు. దానికి కారణం ప్రజలు. ఎపుడూ వారు కేసీయార్ వెంటనే ఉన్నారు.

ఆయన ఎన్ని సార్లు ఉప ఎన్నికలు తెచ్చినా ఓటేసి గెలిపించారు అలా బలమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కేసీయార్ అనేక సార్లు ఢీ కొట్టారు. అలాంటి కేసీయార్ కి ప్రజల నాడి తెలుసు. వారి మాట తెలుసు. వారి గుండె తెలుసు. అందుకే ఆయన గెలుపు ధీమాతో ఉన్నారు. కనీసం సింపుల్ మెజారిటీ అయినా దక్కుతుంది అన్న ఆశలు ఉన్నాయి.

కానీ సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. అద్భుతంగా పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ ఇంతలా వీర విహారం చేస్తుందని అసలు ఊహించలేదు గులాబీ బాస్. ఇక ఎన్నికల ప్రచారంలో అక్కడక్కడ ఆ తరహా సూచనలు సంకేతాలు కనిపించినా తనదైన వ్యూహాలతో అధిగమించవచ్చు అని అనుకున్నారు.

కానీ చివరి దాకా అదే టెంపో కొనసాగింది. కాంగ్రెస్ ఎన్నడూ లేని ఐక్యతను ప్రదర్శించింది. ఇక కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి రూపంలో బ్రహ్మండమైన స్టార్ కాంపెనియర్ దొరికారు. ఆయన కసి ప్లస్ కృషి కలీపి పోరాడారు. అలా కాంగ్రెస్ ఘనమైన విజయం దక్కితే బీయారెస్ కి ఓటమి లభించింది.

ఆదివారం కాస్తా ఆందోళన వారంగా బీయారెస్ కి మారింది. ప్రగతి భవన్ లో వార్ రూం లో కూర్చుని కేసీయార్ మొత్తం ఫలితాల సరళిని చూశారని అంటున్నారు. ఇక కాంగ్రెస్ కి మెజారిటీ రాగానే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఓఎస్డీ ద్వారా దాన్ని గవర్నర్ కి పంపించేశారు. కేసీయార్ ఆ మరుక్షణం చేసిన పని ఏంటి అంటే ప్రగతి భవన్ నుంచి నేరుగా తన ఫాం హౌజ్ కి వెళ్ళిపోవడం.

మొత్తానికి తెలంగాణా ఫలితాలు కేసీయార్ ని పూర్తిగా హర్ట్ చేశాయని అంటున్నారు. ఒక విధంగా సవాల్ చేశాయని అంటున్నారు. ఇక ఈ ఫలితాల తరువాత కొన్నాళ్ళ పాటు కేసీయార్ మౌన ముద్రలోనే ఉండొచ్చు అని అంటున్నారు. అయితే కేటీయార్ వెంటనే యాక్టివ్ అయ్యారు. ఆయన ఓటమిని స్వీకరిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. తాము ప్రతిపక్ష పాత్రలోకి వెళ్తామని కూడా చెప్పేసారు. ప్రజల కోసం పనిచేస్తామని కూడా చెప్పారు.

మొత్తానికి గజ్వేల్ లో గెలిచి కామారెడ్డిలో ఓటమి పాలు కావడం కూడా కేసీయార్ కి తీరని అవమానాన్ని మిగిల్చిందని అంటున్నారు. ఆగమాగం కావద్దు అని ఆయన ఎన్నికల సభలలో జనాలకు చెప్పారు. కానీ జరిగింది వేరుగా ఉంది. దాంతో తెలంగాణా అసెంబ్లీకి కేసీయార్ విపక్ష నేతగా వస్తారా అంటే చెప్పలేమనే అంటున్నారు. బీయారెస్ శాసనసభా పక్ష నేతగా కేటీయార్ ఉండవచ్చు అని అంటున్నారు.

ఇక కేసీయార్ వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేయవచ్చు అని అంటున్నారు. ఇక జాతీయ రాజకీయాలోకే ఆయన వెళ్తారని అసెంబ్లీ లోపలా బయటా పోరాటం అంతా కేటీయార్ హరీష్ లదే అంటున్నారు. అయితే కేసీయార్ వ్యూహాలతో సరైన సమయంలో బయటకు వస్తారని అని అంటున్నారు. సో ప్రస్తుతానికి మాత్రం చూస్తే కేసీయార్ కి ఇది నిలువెత్తు అవమానంగా మారింది అని అంటున్నారు. కొట్లాడి తెలంగాణాను తెచ్చిన కేసీయార్ కి హ్యాట్రిక్ విజయం అందకుండా పోయింది అన్నది జీవిత కాలం వెలితిగానే ఉంటుందని బీయారెస్ వర్గాలు అంటున్నాయి.

Tags:    

Similar News