ఇంట్రస్టింగ్ రిక్వస్ట్... కుమారీ ఆంటీ లాగానే అందరినీ చూడాలి!

అవును... హైదరాబాద్ సిటీలో ఫుట్ పాత్ లు ఆక్రమించుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటున్నవారి షెడ్ ల కూల్చివేత ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-23 14:55 GMT

మాదాపూర్ లోని ఐటీ కోహినూర్ వద్ద కుమారి అంటీ అనే మహిళ రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుకుంటూ సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. రేవంత్ సీఎం అయిన కొత్తలో ట్రాఫిక్ కు ఇబ్బందులు వస్తున్నాయంటూ రోడ్లపక్కన ఉన్న ఈ చిరు వ్యాపారుల దుకాణాలను, బండ్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సంగతి తెలిసిందే.

దీంతో... ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. సీఎం రేవంత్ రెడ్డి వద్దకూ చేరింది. దీంతో.. ఈ విషయంపై స్పందించిన సీఎం ఆమె జోలికి వెళ్లొద్దన్నట్లుగా ట్రాఫిక్ పోలీసులకు, జీ.హెచ్.ఎం.సీ. అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అంటారు. సరిగ్గా ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ.. అందరికీ అవకాశం ఇవ్వాలంటున్నారు ఖైరతాబాద్ ఎమ్మేల్యే!

అవును... హైదరాబాద్ సిటీలో ఫుట్ పాత్ లు ఆక్రమించుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటున్నవారి షెడ్ ల కూల్చివేత ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి స్పందించారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... కూల్చివేతల విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిజంగానే రహదారులకు ఇబ్బంది ఉన్న చోట్ల కూల్చివేతలు చేపడితే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ.. అడ్డగోలుగా ఈ కార్యక్రమం చేపడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

ఈ సమయంలోనే కుమారి ఆంటీ టాపిక్ ఎత్తిన దానం నాగేందర్... చిరు వ్యాపారులు పొట్టకూటి కోసం వేసుకున్న షెడ్లను కూల్చేయటం దుర్మార్గం అని అన్నారు. ఈ సందర్భంగా.. రేవంత్ సీఎం అయిన తొలినాళ్లలో ఐటీసీ కోహినూర్ వద్ద కుమారీ ఆంటీకి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైతే జోక్యం చేసుకున్నారని.. ఆమె జోలికి వెళ్లొద్దని చెప్పారని గుర్తు చేశారు.

ఈ సమయంలో మిగిలిన చిరు వ్యాపారులను కూడా కుమారీ ఆంటీలాగానే పరిగణించాలని.. ఇతర వ్యాపారుల జోలికి కూడా వెల్లొద్దని దానం కోరుతున్నట్లు తెలిపారు. ఒకవేళ దీన్ని ఒక పాలసీ కింద తీసుకుంటే.. సిటీమొత్తంలో ఇలాంటి కూల్చివేతలు చేపట్టాలని భావిస్తే.. ముందుగా ఓల్డ్ సిటీ నుంచి మొదలుపెట్టాలని సూచించారు.

ఇలా ఏకపక్షంగా కూల్చివేతలు చేపడితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని.. ఈ కూల్చివేతల కారణంగా తమకు నిద్ర పట్టడం లేదని అన్నారు. ఈ కూల్చివేతలపై సమాచారం రాగానే చిరు వ్యాపారులు వచ్చి తన ఇంటి వద్ద కూర్చుంటున్నారని.. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన తాను వారికి జవాబుదారీగా ఉంటానని అన్నారు.

ఇలా.. హైదరాబాద్ లో రోడ్లపక్కన ఉన్న చిరు వ్యాపారుల షెడ్డులు కూల్చివేతలపై కుమారీ ఆంటీ వ్యవహారంపై రేవంత్ రెడ్డి స్పందనను దానం నాగేందర్ తెరపైకి రేవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీనిపై సీఎం రేవంత్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది.. అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News