RR ట్యాక్స్ లేదు .. దేశంలో AA ట్యాక్స్

మోడీ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించాడు.

Update: 2024-05-04 03:00 GMT

‘‘అవినీతి విషయంలో కాంగ్రెస్ పార్టీకి గోల్డ్ మెడల్ దక్కితే .. బీఆర్ఎస్ పార్టీకి సిల్వర్ మెడల్ వస్తుంది. ఈ విషయంలో ఒకరు విన్నర్ అయితే మరొకరు రన్నర్. తెలంగాణ రాష్ట్రంలో డబల్ ఆర్ ట్యాక్స్ నడుస్తున్నది’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల తెలంగాణ పర్యటనలో, తాజాగా టీవీ 9 ఇంటర్వ్యూలో ఆరోపించారు. మోడీ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించాడు.

‘‘రాష్ట్రంలో డబులార్ ట్యాక్స్ లేదు. ఆదానీ, అంబానీల కోసం దేశంలో డబల్ ఏ ట్యాక్స్ నడుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మోడీ చేసిన ఆరోపణలలో నిజం లేదని, తమ ప్రభుత్వం నిజాయితీతో కూడిన పరిపాలన అందిస్తుందని’’ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నాడు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకోబోతున్నదని, అందుకే మోదీ అలా మాట్లాడారని అన్నారు.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో రెండో స్థానం కోసం బీజేపీ, బీఆర్ఎస్ పోటీపడుతున్నాయని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు తావు ఉండదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అని జ్యోస్యం చెప్పారు.

Tags:    

Similar News