వ్యక్తిగత ద్వేషం లేదు.. ఆ మాటలు ఉపసంహరించుకుంటున్నా..!

రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం ఒక్కోసారి బోర్డర్ దాటి పోతుంది అని చెప్పడానికి ఇదొక ఉదహరణ అని చెప్పొచ్చు.

Update: 2024-10-03 05:16 GMT

రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం ఒక్కోసారి బోర్డర్ దాటి పోతుంది అని చెప్పడానికి ఇదొక ఉదహరణ అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్లో అవసరం లేని అక్కినేని ఫ్యామిలీ ఇంకా సమంత పేర్లను ప్రస్తావించారు. నాగ చైతన్య, సమంత డైవర్స్ కు కారణం కేటీఆరే అని కొండా సురేఖా కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే అక్కినేని నాగార్జున స్పందించారు. నాగ చైతన్య, సమంత కూడా వ్యక్తిగత విషయాలకు ప్రైవసీ ఇవ్వాలని.. మాకు ఎలాంటి రాజకీయాలు వద్దని అన్నారు.

ఐతే ఈ విషయంపై సినీ పరిశ్రమ అంతా కూడా మంత్రి కొండా సురేఖని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో స్పందించారు. ఐతే తను చేసినా వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్న కారణంగా కొండా సురేఖ స్పందించారు. అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు తప్ప ఎవరిపైనా తనకు వ్యక్తిగత ద్వేషం లేవని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న భావోద్వేగంలో ఆ కామెంట్స్ చేశానని అన్నారు.

కేటీఆర్ పై విమర్శలు చేసే టైం లో అనుకోకునా ఒక ఫ్యామిలీ గురించి ప్రస్తావించానని.. తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవని అన్నారు. ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్ట్ చూసి చాలా బాధపడినట్టు చెప్పారు కొండా సురేఖ. తాను ఏ విషయంలో బాధపడ్డానో.. ఆ విషయంలో మరొకరిని బాధపెట్టానని తెలిసి ఆ వ్యాఖ్యలను బేషరుగా ఉపసంహరించుకుంటున్నాను. తాను పడిన బాధ వేరే వాళ్లు పడకూడాని ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తాను అప్పుడే దీనిపై స్పందిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశానని గుర్తు చేశారు.

కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదని అన్నారు. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అని. ఆయన చేసిందంతా చేసి నన్ను క్షమాపణ చెప్పమనడం దొంగే దొంగా దొంగా అన్నట్టుగా ఉందని అన్నారు. కే టీ ఆర్ లీగల్ నోటీస్ పై కూడా తాను న్యాయపరంగా ముందుకెళ్తానని అన్నారు కొండా సురేఖ.

Tags:    

Similar News