కోటంరెడ్డికి బిగ్ షాక్... సజ్జలతో మేయర్ భేటీ!
అవును... వైసీపీ బహిషృత నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి తాజాగా గట్టి షాకే తగిలిందని చెప్పుకోవాలి.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో దాదాపు ప్రతీ నియోజకవర్గంలోనూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు. పైగా ఈసారి వైనాట్ 175 అధికారపార్టీ దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్ధులకు షాకిచ్చే పనులకు పూనుకుంటుందని తెలుస్తుంది. ఈ క్రమంలో తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్ తగిలే అంశం జరిగింది!
అవును... వైసీపీ బహిషృత నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి తాజాగా గట్టి షాకే తగిలిందని చెప్పుకోవాలి. కారణం... కోటంరెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన నెల్లూరు నగర మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ మళ్లీ వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగా తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు! వీరు త్వరలో జగన్ తో సమావేశమయ్యే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. దీంతో వీరిద్దరూ వైసీపీలోకి వెళ్లిపోయినట్లే అనే ప్రచారం ఊపందుకుంది. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇది కాస్త గట్టి షాకే అని అంటున్నారు పరిశీలకులు.
నెల్లూరు నగరంలోని 12వ డివిజన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న స్రవంతి... నెల్లూరు నగర మేయర్ పదవి ఎస్టీకి రిజర్వ్ అవ్వడంతో.. ఆ పదవి ఆమెను వరించింది. ఈ సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గంగా ఆమె కొనసాగుతూ వచ్చారు. అనంతర కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.
అప్పుడు కూడా స్రవంతి దంపతులు ఆయనతోపాటే టీడీపీకి మద్దతు పలికారు. దీంతో... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బలం ఏమీ పోలేదులే అనే కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో కోటంరెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డితో మేయర్ దంపతులకు విభేదాలొచ్చాయని తెలుస్తుంది. దీంతో వీరి తిరిగి మాతృపార్టీ వైపు కదిలారు!
దీంతో... నెల్లూరు రురల్ లో శ్రీధర్ రెడ్డికి ఇది గట్టి దెబ్బే అని అంటున్నారు విశ్లేషకులు. అయితే... నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యూహంలో భాగంగానే మేయర్ దంపతులు వైసీపీకి మళ్లీ దగ్గరయ్యారని తెలుస్తుంది.