అదానీ ఇష్యూలో జగన్ ఇన్వాల్వ్ అయితే... కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!

ఇదే సమయంలో... "లంచం ఎవరికిచ్చిన సరే.. మీరన్నట్లు జగనా, ఇంకొకరా నాకు తెలియదు.. నిజమే అయితే తప్పకుండా చర్య ఉంటుంది

Update: 2024-11-22 10:55 GMT

అదానీపై కేసు వ్యవహారం అటు అమెరికాలోనూ, ఇటు ఇండియాలోనూ తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ఈ వ్యవహారం రాజకీయంగానూ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధానంగా కేంద్రంలో మోడీ పైనా.. ఇటు ఏపీలో జగన్ పైనా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ స్కామ్ పేరు చెప్పి ఫైరవుతున్నాయి.

ఇందులో భాగంగా.. అదానీ పేరు చెప్పి "మోదానీ లిస్ట్ లో మరో స్కామ్ వచ్చి చేరింది.. అయినా కూడా అదానీకి ఏమీ కాదు.. ఆయనకు ఏమీ కాకుండా మోడీ చూసుకుంటారు" అంటూ కాంగ్రెస్ కామెంట్ చేస్తుంది! మరోపక్క... జగన్ అక్రమాలు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయని ఏపీలో విపక్షాలు మండిపడుతున్నాయి.

మరోపక్క ఏపీలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు విషయంలో అదానీ సంస్థల నుంచి జగన్ కు రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారనే విషయం అవాస్తవమని చెబుతూ.. అసలు విషయం ఏమిటంటే.. అంటూ వైసీపీ సవివరంగా వివరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమయంలో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

అవును... అదానీ వ్యవహారం.. ఏపీతో పాటు నాలుగు రాష్ట్రాల్లో 'ఉన్నత స్థాయి వ్యక్తులకు' లంచం ఇవ్వడానికి సిద్ధపడ్డారు అనే అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోన్న వేళ.. బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంలో జగన్ అయినా చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే అని అన్నారు.

ఇందులో భాగంగా.. "అదానీ ముడుపులు ఇచ్చారని నిన్న కోర్టు చెప్పింది.. అట్లాగే ఎవరికి ఇచ్చారో కూడా చెప్పమనండి.. చెప్పిన తర్వాత డెఫనెట్ గా చట్టం ప్రకారం, ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం ఏమి జరగాలో అది చేయాలి.. తప్పేముంది?" అని అన్నారు.

ఇదే సమయంలో... "లంచం ఎవరికిచ్చిన సరే.. మీరన్నట్లు జగనా, ఇంకొకరా నాకు తెలియదు.. నిజమే అయితే తప్పకుండా చర్య ఉంటుంది.. తీసుకోవాలని నేను కోరతా ఉన్నాను.. కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఖండించడాలు ఉండవు.. తీర్పు వచ్చిన తర్వాత అప్పీలుకు పోవాలి" అని వ్యాఖ్యానించారు.

కాగా.. ఇదే వ్యవహారంపై గురువారం ఎక్స్ వేదికగా స్పందించిన బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత... "అఖండ భారతంలో అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా?" అంటూ స్పందించిన సంగతి తెలిసిందే!




Tags:    

Similar News