కుప్పంలో వైసీపీ ఆఫీస్ క్లోజ్...?

ఇక కుప్పం నియోజకవర్గం కేంద్రంలో భారీ ఎత్తున వైసీపీ ఆఫీసుని కూడా ఆనాడు ఏర్పాటు చేసి హడావుడి చేశారు.

Update: 2024-10-22 17:40 GMT

వై నాట్ కుప్పం ఇది జగన్ నుంచి వచ్చిన ఒక పవర్ ఫుల్ నినాదం. మొత్తం ఏపీలోని 175 సీట్లూ వైసీపీవే అంటూ ఆనాడు అతి ఆర్భాటంగా కడు నిబ్బరంగా వైసీపీ అధినాయకత్వం ఇచ్చిన స్లోగన్ ఇది. అందులో భాగంగా కుప్పం సీటుని కూడా ఈసారి గెలుచుకుని తీరుతామని చంద్రబాబు మాజీ సీఎం మాత్రమే కాదు మాజీ ఎమ్మెల్యేను కూడా చేస్తామని పార్టీ పెద్దలు రీ సౌండ్ చేశారు.

కుప్పంలో భరత్ అనే బీసీ నేతను ఇంచార్జిగా చేసి ఆయనకు ఎమ్మెల్సీగా కూడా అధికారం కట్టబెట్టి అన్ని రకాలైన అస్రాలు కుప్పంలో ప్రయోగిస్తూ బాబుని ముప్పతిప్పలు పెట్టిన సంగతులు ఇంకా జనాలకు గుర్తు ఉండనే ఉంది. కుప్పం పర్యటనకు బాబు వచ్చినప్పుడల్లా ఇబ్బందులు కూడా కలుగచేసిన సందర్భాలు ఆనాడు చూశారు.

ఇక కుప్పం నియోజకవర్గం కేంద్రంలో భారీ ఎత్తున వైసీపీ ఆఫీసుని కూడా ఆనాడు ఏర్పాటు చేసి హడావుడి చేశారు. దాంతో టీడీపీ మీద సమరానికి వైసీపీ శ్రేణులకు ఉత్సాహం కూడా పెంచారు. అయితే ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలు అయింది. చంద్రబాబు కుప్పంలో మంచి మెజారిటీతో గెలిచారు.

ఆయన ఇపుడు పవర్ ఫుల్ సీఎం గా ఉన్నారు. గడచిన నాలుగు నెలలుగా కుప్పంలో వైసీపీ తగ్గిపోతూ వస్తోంది. పెద్దగా యాక్టివిటీస్ ఏమీ లేదు. ఇపుడు లేటెస్ట్ గా చోటు చేసుకున్న మరో పరిణామం ఏంటి అంటే కుప్పంలో వైసీపీ ఆఫీసుని క్లోజ్ చేస్తున్నారు అని. దానిని క్లోజ్ చేసి ఏకంగా ఒక రెస్టారెంట్ కి ఆ భవనాన్ని లీజుకి ఇవ్వాలని ఎమ్మెల్సీ భరత్ నిర్ణయించారు అని అంటున్నారు.

దాంతో వైసీపీకి కుప్పం నియోజకవర్గంలో ఇక వైసీపీ ఆఫీసు అన్నది ఉండదని అంటున్నారు. దాంతో పార్టీ వారికి నాయకులకు వారధిగా ఆఫీసు లేకపోతే ఎలా అని అంటున్నారు. పార్టీకి ఒక ఆఫీసు అన్నది లేకపోవడం ఇబ్బందే అని అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీలో మరో వర్గం నుంచి అయితే భరత్ మీద తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

భరత్ మిస్సింగ్ అని కొందరు ప్రచారం కూడా చేస్తున్నారు. పూర్తిగా పార్టీ యాక్టివిటీస్ ని భరత్ మానుకున్నారని కూడా అంటున్నారు. దంతో కుప్పం విషయంలో అధినాయకత్వం జోక్యం చేసుకోవాలని ఇంచార్జిగా చురుకైన వారిని తీసుకోవాలని అవకాశం అలా ఇవ్వాలని కోరుతున్నారు.

భరత్ ఎందుకో డల్ అయ్యారని అంటున్నారు. ఇక కుప్పంలో వైసీపీ వారిని నయానా భయానా తమ వైపు తిప్పుకోవడంలో లేక వారిని సైలెంట్ చేయడమో చేస్తూ టీడీపీ అక్కడ నూరు శాతం ప్;ఐ చేయి సాధించింది అని అంటున్నారు. దాంతో కుప్పంలో ఇపుడు వైసీపీ ఫ్యాన్ తిరగడం లేదని అంటున్నారు. ఇక ఎమ్మెల్సీలు వరసబెట్టి టీడీపీ కూటమి వైపు పోతున్నారు. దాంతో భరత్ మీద కూడా అనుమానం చూపులు ఉన్నాయని అంటున్నారు.

లేకపోతే కుప్పంలో టీడీపీ ప్రమేయం లేకుండానే పార్టీ ఆఫీసుని ఎత్తివేయాలని డిసైడ్ కావడమేంటి అని చర్చించుకుంటున్నారు. మొత్తం మీద కుప్పంలో సీన్ వైసీపీకి రివర్స్ అవుతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News