ఉత్తర అమెరికా పై తగ్గుతున్న ఇండియన్స్ ఇంట్రస్ట్... ఇంత మార్పా?
ఇలా పాలన మార్పు తర్వాత అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో భారీ మార్పు కనిపించిందని చెబుతున్నారు.
మరికొన్ని రోజులుల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. ఆ రోజు కోసం ట్రంప్ అభిమానులు, రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు, అమెరికన్లు మాత్రమే కాకుండా.. ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. మరికొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో.. ఉత్తర అమెరికాకు వలస వెళ్లే భారతీయ విద్యార్థుల్లో క్షీణత చర్చనీయాంశంగా మారింది.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్.. మరికొన్ని రోజుల్లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇలా పాలన మార్పు తర్వాత అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో భారీ మార్పు కనిపించిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో 30% క్షీణత ఏర్పడిందని నివేదికలు చెబుతున్నాయి.
ప్రధానంగా ట్రంప్ పరిపాలనపై ప్రపంచ దేశాలకు ఉన్న ఆలోచన, అంచనా మేరకే భారతీయ విద్యార్థుల విషయంలో ఈ మార్పు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర అమెరికాలోని అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలైన అమెరికా, కెనడా వెళ్లే భారతీయ విద్యార్థుల నమోదులో ఈ ఏడాది గణనీయమైన తగ్గుదల కనిపించిందని అంటున్నారు.
గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన హామీల్లో ప్రధానంగా కఠినమైన ఇమ్మిగ్రేషన్స్ ఒకటి! ఇది భారతీయులతో పాటు అమెరికాకు వెళ్లే ప్రపంచ దేశాల్లోని విద్యార్థుల్లో ఆందోళనకు కారణమైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, కెనడాలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్న భారతీయ విద్యార్థులు.. ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు.
వాస్తవానికి 2023లో భారత్ నుంచి అమెరికాకు 2.69 లక్షల మంది.. కెనడాకు 4.27 లక్షల మంది విద్యార్థులు వెళ్లారు. అయితే... ట్రంప్ ఇమ్మిగ్రేషన్స్ విధానలపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో భారతీయ విద్యార్థుల రాక యూఎస్ కు 30%, కెనడా కఠిన నిర్ణయాల కారణం అటు 60% తగ్గుదల ఏర్పడిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో... భారతీయ విద్యార్థుల చూపు అమెరికా, కెనడా కాకుండా ఇప్పుడు ప్రధానంగా యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా వైపు పడిందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఫ్రాన్స్, స్వీడన్ వంటి యూరోపియన్ దేశాలు కూడా ఈ ఏడాది విదేశీ విద్యార్థుల రాకను పెంచుతున్నాయని చెబుతున్నారు.