లిక్కర్ స్కామ్‌లో లెక్కలు తేలాయా?
కానీ, ఏమీ లేదనేది తాజాగా సుప్రీంకోర్టులో సీబీఐ చేసిన వాదనలను బట్టి తేలిపోయిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారు 2020-21 మధ్య తీసుకువచ్చిన నూతన మద్య పాలసీలో అక్రమాలు చోటు చేసుకున్నా యని.. మనీ లాండరింగ్ జరిగిందని పేర్కొంటూ.. లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం తమ చేతిలోని ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలను రంగంలోకి దింపడం తెలిసిందే. ఇది సుదీర్ఘ కాలంగా జరుగుతున్న ప్రక్రియ. దాదాపు రెండేళ్లు అయిపోతోంది. ఈ విచారణలో వారు ఏం తేల్చారు? అనేది మా త్రం ఇతమిత్థంగా చెప్పలేక పోతున్నారు.
కానీ, ఏమీ లేదనేది తాజాగా సుప్రీంకోర్టులో సీబీఐ చేసిన వాదనలను బట్టి తేలిపోయిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ లిక్కర్ కుంభకోణం అనే ఆరోపణలను అడ్డు పెట్టుకుని ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ మాత్రం తన ఆవేశాన్ని తీర్చుకునే అవకాశం ఏర్పరుచుకుంది. ఫలితంగానే అనేక మంది అరెస్టులు.. జైళ్లు చోటు చేసుకున్నాయి. ఏ ఆరోపణలతో అయితే.. ఇంత మంది అరెస్టు అయ్యారో.. వారు కొన్నాళ్లు బాధను అనుభ వించినా.. ఇప్పుడు బెయిల్‌పై బయటకు వచ్చారు.
కానీ, ఇప్పుడు ఈ కేసును నిరూపించడం.. దానిని జరిగిందని చెప్పడం అనే రెండు కీలక ఘట్టాలు కూడా. మోడీ ముందు నిలబడ్డాయి. నిరూపించలేక పోతే.. ఆయనే బాధితుడుగా మారనున్నారు. ఎందుకంటే.. కేజ్రీవాల్‌పై కత్తికట్టినట్టు వ్యవహరించినా.. ఆయన బయటకు వచ్చారు. కేసీఆర్ కుమార్తె కవిత బయటకు వచ్చింది. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. బయట పడ్డారు. కానీ.. ఈ కుంభకోణం ఏంటి? అంటే.. కేవలం ఆ వంద కోట్ల చుట్టూనే తిరుగుతోంది. ఇది రాజకీయ దుమారం!
గోవాలో జరిగిన ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీపార్టీని నిలువరించే ప్రయత్నం చేసిన బీజేపీ రూపాయి చిక్కకుం డా జాగ్రత్త పడిందనేది వాస్తవం. కానీ, ఏదో ఒక రూపంలో అక్కడి నేతలకు రూ.100 కోట్లు ముట్టాయి. ఇదీ.. అసలు సంగతి. ఇలా దక్కడం ద్వారానే తమ గెలుపునకు ఇబ్బందులు సృష్టించారన్నది అసలు రీజన్. అందుకే భవిష్యత్తులో తమను కాదనే వారికి ఇలాంటి పరిణామాలే ఉంటాయని హెచ్చరికగా చెప్పడమే ఈ అరెస్టు పర్వంలో దండలో దారం వంటి కారణం. ఇంతకు మించి.. డిల్లీ లిక్కర్ కేసులో తేలిన లెక్కలు ప్రత్యేకంగా ఏమీ లేక పోవడం గమనార్హం.