ఇదేం పాడుబుద్ది.. ముగ్గురు పిల్లల తల్లితో లేచిపోయిన ఇంటర్ విద్యార్థి!

నాగ్‌పూర్‌లో ఒకే ప్రాంతంలో నివసించే ఈ మహిళకు, బాలుడికి పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా వీరి సంబంధం గాఢమై శారీరక సంబంధానికి దారితీసినట్లు సమాచారం.;

Update: 2025-03-10 19:30 GMT

సభ్య సమాజంలో వావి వరుసలు అన్నవి అడగంటుతున్నాయి. తమ సుఖమే ముఖ్యం అన్న ధోరణి పెరిగిపోతోంది. అది మంచినా.. చెడునా? అన్న వివక్ష, విచక్షణ కొరవడుతోంది. ప్రేమ సంబంధాలు వయస్సు, కుటుంబ పరిస్థితులను దాటి సంచలనాలు రేపుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అలాంటి ఓ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి అయిన 36 ఏళ్ల మహిళ, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థితో పరారైన ఘటన అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.

-పరిచయం ఎలా ఏర్పడింది?

నాగ్‌పూర్‌లో ఒకే ప్రాంతంలో నివసించే ఈ మహిళకు, బాలుడికి పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా వీరి సంబంధం గాఢమై శారీరక సంబంధానికి దారితీసినట్లు సమాచారం. దీంతో విడిచి ఉండలేకపోయిన వీరిద్దరూ డిసెంబర్ 2న కలిసి ఇంటి నుంచి పారిపోయారు.

-తల్లిదండ్రుల ఫిర్యాదు.. పోలీసుల విచారణ

బాలుడు కనిపించకపోవడంతో అతని తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ బ్రాంచ్‌లోని యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కేసును దర్యాప్తు చేసింది. సుదీర్ఘ అన్వేషణ అనంతరం, వీరిద్దరిని మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ ప్రాంతంలో గుర్తించారు.

-కాపురం మొదలుపెట్టిన మహిళ- బాలుడు

ఆ మహిళ తన బంగారు ఆభరణాలను అమ్మి అద్దెకు ఇంటిని తీసుకుని అవసరమైన వస్తువులను కొనుగోలు చేసింది. ఆమె క్యాటరింగ్ సమూహంలో వంట మనిషిగా పని చేయగా బాలుడు సర్వీస్ బాయ్‌గా పనిచేశాడు. వీరిద్దరూ కలిసి కొత్త కాపురం మొదలుపెట్టడం గమనార్హం.

- సోషల్ మీడియా ద్వారా గుట్టు రట్టు

బాలుడు తన సోదరికి సోషల్ మీడియా ద్వారా సందేశం పంపడంతో పోలీసులు వారు ఎక్కడున్నది గుర్తించగలిగారు. దీంతో నాగ్‌పూర్ పోలీసులు వీరి లోకేషన్ ను కనుగొని మహిళను అరెస్ట్ చేసి, బాలుడిని అతని తల్లిదండ్రులకు అప్పగించారు.

పరారైన బాలుడి వయస్సు 16 సంవత్సరాలు కాగా, మహిళ పెద్దకొడుకు వయస్సు 12 సంవత్సరాలు కావడం షాకింగ్ అంశంగా మారింది. గతంలోనూ వీరిద్దరూ నాలుగు రోజుల పాటు ఇంటి నుంచి పారిపోయి తిరిగి వచ్చిన ఘటన నమోదైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News