బెంగళూరు నుంచి ఏపీకి... లోకేష్ – పాయ్ మధ్య ఇంట్రస్టింగ్ ట్వీట్స్!
తాజాగా ఇదే విషయాలపై పారిశ్రామికవేత్త మోహన్ దాస్ పాయ్ ఎక్స్ లో ఓ స్ట్రాంగ్ ట్వీట్ చేయగా.. దానిపై లోకేష్ ఎంట్రీ ఇచ్చి, ఇంట్రస్టింగ్ రిప్లై ఇచ్చారు.
బెంగళూరులో డ్రైనేజ్ సమస్యలు, ట్రాఫిక్ సమస్యల గురించి అక్కడున్న ఎవరిని అడిగినా కథలు కథలుగా చెబుతారు. ప్రధానంగా వర్షం కురిసిన సమయంలో అయితే.. ఆ నరకం వర్ణణాతీతం అని అంటారు. తాజాగా ఇదే విషయాలపై పారిశ్రామికవేత్త మోహన్ దాస్ పాయ్ ఎక్స్ లో ఓ స్ట్రాంగ్ ట్వీట్ చేయగా.. దానిపై లోకేష్ ఎంట్రీ ఇచ్చి, ఇంట్రస్టింగ్ రిప్లై ఇచ్చారు.
అవును... రోడ్లు, డైనేజీ, ఓ.ఆర్.ఆర్.పై ట్రాఫిక్ సమస్యలు విపరీతమైన ఆగ్రహాన్ని కలిగిస్తున్నాని.. అనేక ఎం.ఎన్.సీ.లు సిటీ వెలుపల విస్తరించాడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వస్తోందని.. సీఎం, డిప్యూటీ సీఎం పదే పదే చేసిన వాగ్ధానాలు నిలబెట్టుకోవడం లేదని.. సిటీనీ, ఉద్యోగులనూ కాపాడుకునేలా సీఎం, డిప్యూటీ సీఎం తక్షణం చర్యలు తీసుకోవాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు పాయ్.
ఇదే సమయంలో... తన సొంత పౌరుల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ.. నిర్లక్ష్యపూరితమైన, ఉదాసీనమైన ప్రభుతం కలిగి ఉండటం మనందరికీ విచారకరం అని రాసుకొచ్చారు. అనంతరం.. గత 20 ఏళ్లలో ఇలాంటి ఇబ్బంది ఎప్పుడూ చూడలేదని అనడం గమనార్హం. ఇలా బెంగళూరులో ఉన్న సమస్యలపై పారిశ్రామికవేత్త ఫిర్యాదు చేయడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
ఇందులో భాగంగా... సీఎం చంద్రబాబు ఏపీలో నూతన, వ్యాపార అనుకూల విధానాలను ప్రవేశపెట్టారని అన్నారు. తాము పరిశ్రమలను.. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిలో కీలక భాగస్వామిగా చూస్తామని అన్నారు. ఇదే క్రమంలో... ఏపీలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను, అసాధారణమైన వ్యాపార అనుకూల వ్యవథను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఈ ట్వీట్ పై తిరిగి స్పందించిన మోహన్ దాస్ పాయ్.. లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం.. జగన్ హయాంలో ఏపీలో నమ్మకం పాళ్లు తక్కువగా ఉన్నాయని.. వాటిని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
అనంతరం స్పందించిన లోకేష్... ఐదేళ్లు ఏపీలో పరిస్థితులు కఠినంగా ఉన్నాయనే విషయాన్ని తాను పూర్తిగా అర్ధం చేసుకున్నానని.. అయితే ఇప్పుడు పునర్నిర్మాణం పై దృష్టి పెట్టామని.. ఆ నమ్మకాన్ని తిరిగి పొందే ప్రయత్నాల్లో భాగంగా అమరావతితో స్పష్టమైన పురోగతిని సాధిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యలోనే బెంగళూరు వదిలి ఏపీకి రావాలని.. ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి ఆరు పాలసీలు సిద్ధం చేశామని తెలిపారు.