.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

దారుణమైన వైరల్‌ వీడియో.. మహిళతోపాటు ఇద్దరు చిన్నారులు!

ఇప్పుడు వర్షాకాలం. దేశమంతా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

Update: 2024-07-01 09:26 GMT

ఇప్పుడు వర్షాకాలం. దేశమంతా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. డ్యామ్‌ లు, ప్రాజెక్టులు, జలపాతాలు జలకళతో ఉట్టిపడుతున్నాయి. దీంతో వీటిని చూడటానికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే ప్రమోదం మాటున ప్రమాదం కూడా పొంచి ఉంటుందని గుర్తించలేకపోతున్నారు.

ఇప్పుడు ఇలాగే మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలో భూసీ డ్యామ్‌ చూడటానికి వెళ్లిన ఐదుగురు సభ్యుల కుటుంబం నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. వీరిలో ముగ్గురు చనిపోగా మరో ఇద్దరు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలోని భూసీ డ్యామ్‌ బ్యాక్‌వాటర్‌ సమీపంలోని జలపాతం చూడటానికి 36 ఏళ్ల మహిళ తనతోపాటు మరో నలుగురు చిన్నారులను తీసుకుని వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం వారంతా నీటి మధ్యలో సంతోషంతో తుళ్లుతున్నారు. ఇంతలో ఉన్నట్టుండి నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో నీటి మధ్యలో ఉన్న మహిళ.. చిన్నారులను చుట్టూ గట్టిగా పట్టుకుంది. అయినప్పటికీ వరద ఉధృతికి ఆమెతోపాటు నలుగురు చిన్నారులు ఒక్కసారిగా కొట్టుకుపోయారు. వీరిలో మహిళతోపాటు 13 ఏళ్లు, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు మరణించారు. వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

Read more!

ఈ దారుణ ప్రమాదంలో కొట్టుకుపోయిన మరో 9 ఏళ్ల బాలిక, నాలుగేళ్ల బాలుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు.

భూసీ డ్యామ్‌ కు 2 కిలోమీటర్ల దూరంలోని జలపాతంలో ప్రమాదం జరిగిందని పుణె రూరల్‌ ఎస్పీ పంకజ్‌ దేశ్‌ ముఖ్‌ తెలిపారు. జలపాతంలో పడిపోయి దిగువకు కొట్టుకుపోయారని.. అక్కడ నీటిలో మునిగిపోయి మహిళ, ఇద్దరు బాలికలు మరణించారని తెలిపారు. మిగతా ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

ఈ దారుణ ఘటనలో మృతి చెందినవారు హడప్సర్‌ ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది. అన్సారీ కుటుంబం విహారయాత్ర కోసం భూసీ డ్యామ్‌ బ్యాక్‌ వాటర్‌ కు వచ్చింది. అనంతరం జలపాతం చూడటానికి వెళ్లారు. ఇంతలో భారీ వర్షంతో కురవడంతో జలపాతంలో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఆ ప్రవాహ ఉధృతికి వారంతా కొట్టుకుపోయారు.

Full View
Tags:    

Similar News