మంచు ఫ్యామిలీకి మీడియాలో స్పేస్ లేదా?

ఆ కారణంగానే సోషల్ మీడియా వేదికగా అన్నదమ్ములు ఇద్దరూ ఒకరిపై ఒకరు పరోక్ష పోస్టులు పెట్టుకుంటున్నట్లున్నారు అని అంటున్నారు.

Update: 2025-01-18 15:30 GMT

ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా వ్యాప్తి పీక్స్ కి చేరగా.. అటు మీడియా స్పేస్ కూడా చాలా పెరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓ మాదిరి ముఖ్యమైన అన్ని అంశాలనూ ప్రాధాన్యతా క్రమంలో కవర్ చేసి ప్రపంచానికి చూపిస్తుంది మీడియా. అయితే... 'మంచు ఫ్యామిలీలో మంటలు' వ్యవహారంలో మాత్రం కొత్త సంవత్సరంలో మీడియా అంతగా ఆసక్తి చూపడం లేదనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... వాస్తవానికి గత ఏడాది మంచు ఫ్యామిలీ వివాదం ఒక్కసారిగా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు ప్రాణహాని ఉందని మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం.. అంతకంటే ముందు కాస్త నడవడానికి ఇబ్బంది పడుతూ హాస్పటల్ కు రావడంతో.. మంచు ఫ్యామిలీలో ఏదో జరుగుతుందనే చర్చ మొదలైంది.

ఇదే సమయంలో.. తనకు మంచు మనోజ్ తో ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేయడం.. ఆ రోజు జల్ పల్లి లోని నివాసం వద్ద సుమారు 60 నుంచి 70 మంది బౌన్సర్లు ఉండటం.. ఆ సమయంలో మంచు విష్ణు విదేశాల నుంచి రావడం.. ఇలా రకరకాల ఇష్యూలతో విషయం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది. మీడియా కూడా ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపించింది.

ఈ క్రమంలోనే జల్ పల్లి వద్ద జరిగిన ఘర్షణలో మంచు మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకు రావడం.. ఆ సమయంలో మీడియాను వెంటపెట్టుకుని వెళ్లడం.. మోహన్ బాబు ఆవేశంతో జర్నలిస్టులపై దాడికి పాల్పడటం.. ఈ దాడిలో ఓ జర్నలిస్టు తీవ్రంగా గాయపడటం.. దీంతో.. మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి మీడియా ఫోకస్ మారిందని అంటున్నారు.

అనంతరం.. మీడియా ఫోకస్ మంచు ఫ్యామిలీ వ్యవహారంపై నుంచి.. మోహన్ బాబు పై కేసు, జర్నలిస్టు న్యాయ పోరాటం, కోర్టులో ముందస్తు బెయిల్ ప్రయత్నాలు, మోహన్ బాబు అరెస్ట్ కు సంబంధించిన ఊహాగాణాలపైకి మారిందని అంటున్నారు. అయితే.. తర్వాతర్వాత దీనికి సంబంధించిన వ్యవహారాలేవీ మీడియాలో పెద్దగా కనిపించలేదు.

ఈ క్రమంలో.. సోషల్ మీడియా వేదికగా అటు విష్ణు, ఇటు మనోజ్ లు తన తండ్రి నటించిన సినిమాలోని పవర్ ఫుల్ డైలాగులతో (తాజా సిట్యువేషన్ కు తగ్గట్లు అన్నట్లుగా!) ఉన్న సన్నివేశాలు కట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. దీంతో... వీరు ఒకరితో ఒకరు చెప్పుకోవాల్సిన, తిట్టుకోవాల్సిన విషయాలు ఇలా సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా చెప్పుకుంటున్నట్లు నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఇదే సమయంలో... మంచు ఫ్యామిలీకి వాట్సప్ గ్రూప్ లేదా అనే చర్చా తెరపైకి వచ్చింది. అయితే.. ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనుకున్న విషయం చెప్పాలి.. లేదా, నేరుగా అధికారులకు ఫిర్యాదులు చేసుకోవాలి.. అదీగాకపోతే, కూర్చుని మాట్లాడుకోవాలి.. అంతే కానీ, ఇలా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పరోక్షంగా తిట్టుకుంటున్నట్లుగా పోస్టులు ఎందుకు పెడుతున్నారు..? అనే కామెంట్లూ చేస్తున్నారు నెటిజన్లు.

ఈ నేపథ్యంలోనే... మీడియాలో మంచు ఫ్యామిలీకి స్పేస్ తగ్గినట్లుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే సోషల్ మీడియా వేదికగా అన్నదమ్ములు ఇద్దరూ ఒకరిపై ఒకరు పరోక్ష పోస్టులు పెట్టుకుంటున్నట్లున్నారు అని అంటున్నారు. ఇలా అటు మీడియాలోనూ స్పేస్ తగ్గిందనే చర్చ నడుస్తండటం.. ఇటు ఆ ఇండరెక్ట్ పోస్టులు ఎందుకు అంటు సోషల్ మీడియాలోనూ మద్దతు కరువవ్వుతుందనే చర్చా తెరపైకి వచ్చిందని అంటున్నారు.

ఏది ఏమైనా... మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదాలపై మొదట్లో మీడియా ఫుల్ ఫోకస్ పెట్టగా, జల్ పల్లిలోని నివాసం వద్ద అప్పట్లో పూర్తి కాన్సంట్రేషన్ చేయగా.. ఈ కొత్త ఏడాది మరోసారి మొదలైన మంచు ఫ్యామిలీలో మంటల విషయంపై మాత్రం మీడియా ఫోకస్ పూర్తిగా తగ్గిందని అంటున్నారు. అంతులేని కథలా ఈ ఏపిసోడ్ సాగుతుండటం వల్లే ఈ పరిస్థితా అనే చర్చా నడుస్తుందని అంటున్నారు.

మరి మంచు ఫ్యామిలీ వివాదంపై మీడియా ఇలా లైట్ గానే ఉంటుందా..? ఈ సమయంలో మీడియా ఫుల్ ఫోకస్ పెట్టే ఘట్టం ఏమైనా తెరపైకి వస్తుందా..? వచ్చే వరకూ మీడియా ఇలానే ఉంటుందా..? అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News