మ్యాన్ ఫోర్స్ ఏఐ పవర్డ్ కండోమ్.. ట్విస్ట్ ఏమిటంటే..?

ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ఓ చిలిపి పనికి పూనుకుంది మ్యాన్ ఫోర్స్ కం*డోమ్స్.;

Update: 2025-04-02 04:25 GMT
మ్యాన్ ఫోర్స్ ఏఐ పవర్డ్ కండోమ్.. ట్విస్ట్ ఏమిటంటే..?

మ్యాన్ కైండ్ ఫార్మాకు చెందిన కం*డోమ్ బ్రాండ్ మ్యాన్ ఫోర్స్ కండోమ్స్.. తాజాగా ఓ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా... మ్యాన్ ఫోర్స్ కండోమ్స్ ద్వారా డాట్ ఏఐ అనే కొత్త శ్రేణి ఫ్యూచరిస్టిక్ కం*డోమ్ లను ప్రవేశపెట్టినట్లు బ్రాండ్ ప్రకటించింది. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది.. అది ఏప్రిల్ ఫూల్స్ డే సెలబ్రేషన్స్ లో భాగం అంట!

అవును... ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ఓ చిలిపి పనికి పూనుకుంది మ్యాన్ ఫోర్స్ కం*డోమ్స్. ఇందులో భాగంగా... ఏఐ కండోమ్స్ ను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఆనందాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లగల దాని సామర్థ్యాన్ని ఈ సందర్భంగా ప్రకటన నొక్కి చెప్పింది. ఇందులో అధునాతన మైక్రో సెన్సార్లను హైలైట్ చేసింది.

పైగా ఇది క్యూఆర్ స్కాన్ సహాయంతో యాప్ ద్వారా పనితీరును, సంతృప్తి శాతాన్ని ట్రాక్ చేస్తుందని తెలిపింది. ఈ ప్రచారాన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో.. ఇన్ స్టా గ్రామ్ లో 30 మిలియన్ వ్యూస్, 87 వేల లైకులు, 300 వేల షేర్లను సంపాదించడం గమనార్హం. ఆ స్థాయిలో ఇది వ్యూవర్స్ ని ఆకర్షించిందని చెప్పొచ్చు.

ఈ సమయంలో కామెంట్స్ సెక్షన్స్ లో స్పందించిన పలువురు నెటిజన్లు... ఇది విప్లవాత్మకమైన ఆలోచన అంటూ ప్రశంసించగా.. మరికొంతమంది ఏఐ శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. అయితే.. ఇంకొంతమంది మాత్రం ఇది ఏప్రిల్ ఫూల్స్ డే కోసం చేసిందని భావించారు. ఇది బ్రాండ్ ప్రమోషన్ ని పీక్స్ కి తీసుకెళ్లిందని.. ఆలోచన సక్సెస్ అయ్యిందని రాసుకొచ్చారు.

ఈ సందర్భంగా స్పందించిన మ్యాన్ కైండ్ ఫార్మా వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ జాయ్ ఛటర్జీ మాట్లాడుతూ... మ్యాన్ ఫోర్స్ కం*డోమ్స్ ఎల్లప్పుడూ ప్రేక్షకులను ఆకర్షించడానికి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తుందని.. వారిని ఆకర్షించే ప్రయత్నంలో వారితో లోతైన సంబంధాన్ని పెంచడానికి తాము ఏప్రిల్ ఫూల్స్ డే ప్రచారాన్ని రూపొందించినట్లు తెలిపారు.

Tags:    

Similar News