పెళ్ళైన మగవారు వేరే మహిళలని ఎందుకు ఇష్టపడతారో తెలుసా?
అయితే ఇలా మగవారు ఎందుకు మారిపోతారు అనే విషయాలపై పలువురి అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం!
పెద్దలు కుదిర్చిన వివాహం అయినా.. ప్రేమ పెళ్లి అయినా.. పెళ్లైన ఏడేళ్ల తర్వాత మగవారి ఆలోచనల్లో మార్పు వస్తుందని.. అనంతరం పక్క చూపులు చూడటం మొదలవుతుందని.. ఫలితంగా చిన్న ఇళ్లు అనే అంశం తెర్రపైకి వస్తుంటుందని అంటుంటారు. ఈ కోణంలో చాలా సినిమాలే వచ్చాయి! అయితే ఇలా మగవారు ఎందుకు మారిపోతారు అనే విషయాలపై పలువురి అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం!
సాధారణంగా పెళ్ళికి ముందు చాలా మంది మగవారు చాలా స్వేచ్ఛగా ఉంటారని అంటున్నారు. చదువుకునే సమయంలోనూ, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాలు చేసే సమయంలోనూ కాస్త స్వేచ్ఛగా ఉంటారని.. ఆ సమయంలో వారిపై ఎలాంటి ఆంక్షలు ఉండవని చెబుతున్నారు.
ఈ సమయంలో పెళ్ళాయిన తర్వాత వారి స్వేచ్ఛ ఒక్కసారిగా ఎగిరిపోయిందనే ఫీలింగ్ కి లోకి వస్తారంట మగవారు. పైగా ఇదంతా బాధ్యతల వల్ల వచ్చిందనే విషయం మరిచి... దీనికి కారణం వారి భార్య అని భావిస్తారంట. ఈ సమయంలో వారి భార్యల్ని కాకుండా ఇతర మహిళలల్ని ఇష్టపడతారని అంటున్నారు.
ఇదే సమయంలో ప్రతి వ్యక్తికి వారి వారి పార్టనర్ విషయంలో కొన్ని ఊహలు ఉంటాయని.. నిజ జీవితంలో అలాంటి పార్టనర్స్ దొరకకపోయిన సందర్భంలో.. వారి ఊహలకు అనుగుణంగా ఉన్నవారిని వెతుక్కుంటూ అందులో సంతృప్తి పొందుతారని చెబుతున్నారు.
సాధారణంగా పెళ్లైన మగవారికి ఏదైనా విషయంలో తృప్తి లేకపోతే వెంటనే దాని నుంచి దూరంగా ఉంటారట. అయితే వివాహ బంధంలో అలా జరుగదు కాబట్టి... ఈ రిలేషన్ లో భార్య నుంచి వారు కోరుకునే ఆనందం దొరకని సమయాల్లో... వేరే మహిళలకి అట్రాక్ట్ అవుతారని అంటున్నారు.
ఇదే క్రమంలో... ప్రతి భర్త కూడా భార్యలు తమని ఇష్టపడాలని, వారి గురించి అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలని, వారే లోకంగా భావించాలని కోరుకుంటారట. అయితే పెళ్లైన అనంతరం అలా జరుగని పక్షంలో భర్తలు.. భార్యల్ని కాకుండా వేరే మహిళల్ని కోరుకుంటారని తెలుస్తోంది.