‘సింగిల్ డిజిట్’ స్టార్లు.. రంజీల్లోనూ టీమ్ ఇండియా బ్యాటర్ల వైఫల్యం

ఈ నేపథ్యంలో గురువారం నుంచి మొదలైన రంజీ ట్రోఫీ మ్యాచ్ లలో రోహిత్ శర్మ, ఓపెనర్ల యశస్వి జైశ్వాల్, యువ బ్యాటర్ శుబ్ మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తదితరులు బరిలో దిగారు.

Update: 2025-01-23 15:30 GMT

న్యూజిలాండ్ తో సొంతగడ్డపై ఎన్నడూ లేని విధంగా క్లీన్ స్వీప్.. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ పరాజయం.. వీటికి ముఖ్య కారణం టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ వైఫల్యం. మరీ ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా పరుగులు చేయలేకపోవడం దారుణ ప్రదర్శన జట్టును బాగా దెబ్బకొట్టింది. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మేల్కొంది. ఎంతటి ఆటాళ్లయిన రంజీలు/దేశవాళీలు ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి మొదలైన రంజీ ట్రోఫీ మ్యాచ్ లలో రోహిత్ శర్మ, ఓపెనర్ల యశస్వి జైశ్వాల్, యువ బ్యాటర్ శుబ్ మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తదితరులు బరిలో దిగారు. ఎలైట్ మ్యాచ్ లలో వీరు ఆడుతున్నారు.

అదే తడబాటు.. రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ మాత్రమే కాదు. ఫస్ట్ క్లాస్ కెరీర్ కూడా ముగింపునకు వచ్చిందేమో అనిపిస్తోంది. గురువారం జమ్మూ కశ్మీర్ వంటి చిన్న జట్టుతో మొదలైన రంజీ మ్యాచ్ లో ముంబై తరఫున బరిలో దిగిన రోహిత్ విఫలమయ్యాడు. అంతర్జాతీయ మ్యాచ్ లలో మాదిరిగానే ఇక్కడా తడబడ్డాడు. అతడు పేలవంగా ఔటయ్యాడు. కేవలం మూడు పరుగులే చేశాడు. ఇదే మ్యాచ్ లో రోహిత్ తో కలిసి ఓపెనర్ గా దిగిన యశస్వి కూడా 4 పరుగులే చేశాడు. వీరు ఆడింది రెండు ఓవర్లు మాత్రమే. రోహిత్ 19 బంతులు ఎదుర్కొన్నాడు. తన ఫేవరెట్ పుల్‌ షాట్ ఆడబి మిడాఫ్ క్యాచ్ ఇచ్చాడు.

టీమ్ ఇండియా వన్డే వైస్‌ కెప్టెన్‌ గా పదోన్నతి దక్కిన శుబ్ మన్ గిల్.. రంజీట్రోఫీలో పంజాబ్‌ కు కెప్టెన్. మరో ఓపెనర్ ప్రభ్‌ సిమ్రన్‌ తో కలిసి ఇన్నింగ్స్‌ ను ప్రారంభించిన అతడు 8 బంతులే ఆడి నాలుగు పరుగులు చేశాడు. ఆసీస్ పర్యటనలో గిల్ విఫలమైన సంగతి తెలిసిందే.

సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌ లో ఢిల్లీ తరఫున దిగిన రిషభ్ పంత్ ఒక్క పరుగే చేయగలిగాడు. ఈ మ్యాచ్ లో కోహ్లి కూడా ఢిల్లీకి ఆడాల్సిన వాడు. మెడ నొప్పి కారణంగా దూరంగా ఉన్నాడు.

కాగా, సౌరాష్ట్రకు ఆడుతున్న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఢిల్లీపై 5 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో ఎలా రాణిస్తాడో చూడాలి.

Tags:    

Similar News