ఏపీలో భారీ పోలింగ్ దిశగా ?
ఇక ఏపీలో చూస్తే మొత్తం నాలుగు కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉండగా మధ్యాహ్నం ఒంటిగంటకే కోటిన్నర మంది ఓట్లు వేశారు అంటే ఎంత పెద్ద ఎత్తున పోలింగ్ సాగుతోంది అన్నది చూడాల్సి ఉంది.
ఏపీ భారీ ఎత్తున పోలింగ్ శాతం దిశగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంటకే ఏకంగా నలభై శాతం పోలింగ్ నమోదు అయింది. అంటే అంటే తొలి ఆరు గంటలలో ఇది రికార్డు స్థాయి పోలింగ్ అన్న మాట. ఇక ఏపీలో చూస్తే మొత్తం నాలుగు కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉండగా మధ్యాహ్నం ఒంటిగంటకే కోటిన్నర మంది ఓట్లు వేశారు అంటే ఎంత పెద్ద ఎత్తున పోలింగ్ సాగుతోంది అన్నది చూడాల్సి ఉంది.
ఇక సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ జరగనుంది. దాంతో మరో అయిదు గంటల సమయం ఉంది కాబట్టి కచ్చితంగా 80 శాతం పైగా ఓటింగ్ జరగవచ్చు అని అంచనా వేస్తున్నారు. పోలింగ్ భారీ ఎత్తున పెరగాలి అని ఎన్నికల సంఘం తో పాటు రాజకీయ పార్టీలు కూడా పట్టుదలగా పనిచేశాయి.
దాంతో ఈసారి గ్రామీణంతో పాటు అర్బన్ ఓటర్లు కూడా పోటా పోటీగా దూసుకుని వస్తున్నారు. భారీ ఎండలను కూడా లెక్కచేయకుండా ఓటర్లు వస్తున్నారు అంటే వెల్లి విరుస్తున్న ఓటరు చైతన్యానికి ఇది కారణం అని అంటున్నారు.
మరో వైపు చూస్తే పోలింగ్ స్టేషన్లలో కూదా బాగా ఏర్పాట్లు చేశారు. దాంతో ఈసారి పోలింగ్ బాగా పెరుగుతోంది అని అంటున్నారు. ఎండలు ఈసారి ఎక్కువగా ఉంటాయి కాబట్టి పోలింగ్ శాతం తగ్గుతుంది అని అనుకున్నారు. కానీ ఈసారి దానికి భిన్నంగా ఎండలలో సైతం నిలబడి ఓట్లు వేస్తున్నారు అంటే ఇది ఓటరు విప్లవంగా అంతా చూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు హైదరాబాద్ బెంగళూరు చెన్నై నుంచి కూడా కదలివచ్చారు. అదే విధంగా ఈసారి ఎన్నడూ లేని విధంగా విదేశాల నుంచి వెల్లువలా వచ్చి ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు.
ఇలా పెరిగిన ఓటింగ్ ఎవరికి లాభం అన్నది కూడా చర్చకు వస్తోంది. మరో వైపు చూస్తే ఓట్ల గల్లంతు అన్న ఫిర్యాదులు ఈసారి ఇప్పటిదాకా లేకపోవడం విశేషం. దొంగ ఓట్లు అన్న ప్రసక్తి కూడా లేదు. ఇంకో వైపు చూస్తే ఓటర్లు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేయడం అంటే దాన్ని ఎలా విశ్లేషించుకోవాలి అన్నది కూడా చూడాల్సి ఉంది.
గతంలో ఎక్కువగా రూరల్ ఓటర్లే పోలింగ్ కి వచ్చేవారు. ఈసారి అర్బన్ ఓటర్లు కూడా క్యూలు కట్టి మరీ ఓటెత్తారు. విశాఖపట్నం లాంటి చోట ఉదయం నుంచే పోలింగ్ బూతులు కిటకిటలాడాయి. అలాగే విజయవాడ తిరుపతి, రాజమండ్రి వంటి చోట్ల కూడా అర్బన్ ఓటర్లు బయటకు వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. దీంతో ఈ పోలింగ్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు. 2019లో 78 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి కచ్చితంగా అది 80 దాటి పోతుంది అన్నది ఒక అంచనా ఉంది.