ఓటేసేందుకు వచ్చిన మంత్రి నాదెండ్ల రిక్వెస్టుకు ఓటర్లు రియాక్షన్ ఇదే

తాజాగా ఆయన తీరు పలువురిని అకట్టుకోవటమే కాదు.. నేత అంటే ఇలా కదా ఉండాలన్నట్లుగా ఆయన తీరు ఉంది.

Update: 2025-02-28 04:41 GMT

చేతిలో అధికారం ఉన్నప్పటికీ మాటలోనూ.. నడతలోనూ దర్పం ప్రదర్శించని నేతలు కొందరు ఉంటారు. అందరికి ఒకేలాంటి మర్యాదను ఇస్తూ.. వేలెత్తి చూపేందుకు అవకాశం ఇవ్వని తీరును ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ కోవలోకే వస్తారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. తాజాగా ఆయన తీరు పలువురిని అకట్టుకోవటమే కాదు.. నేత అంటే ఇలా కదా ఉండాలన్నట్లుగా ఆయన తీరు ఉంది.

గుంటూరు.. క్రిష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. గురువారం పోలింగ్ జరిగింది. తన ఓటుహక్కును వినియోగించుకునేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలోని రావిసాంబయ్య పురపాలక ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా భారీ క్యూలైన్ ఉంది. దీంతో.. ఆయన కాస్త ముందుకు వచ్చి..వరుసలో ఉన్న ఓటర్లను ప్రత్యేకంగా రిక్వెస్టు చేశారు.

సారీ.. ఏమీ అనుకోవద్దు.. బయట పనులు ఉన్నాయి.. మీరు ఓకే అంటేనే ముందుకు వెళతాను? అని అడిగారు. అందుకు అక్కడున్న ఓట్లర్లు సానుకూలంగా స్పందిస్తూ.. వెళ్లండి సార్.. మాకేం ఇబ్బంది లేదంటూ నవ్వుతూ బదులిచ్చారు. దీంతో.. అప్పటికే ఓటు వేస్తున్న వారు బయటకు వచ్చే వరకు వెయిట్ చేసిన నాదెండ్ల మనోహర్.. అనంతరం లోపలకు వెళ్లి ఓటేశారు. మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆ దర్పాన్ని ప్రదర్శించకుండా.. క్షమించాలని కోరటం.. మర్యాదపూర్వకంగా రిక్వెస్టు చేసుకోవటం లాంటివి ఆకర్షించాయి. అసలు సిసలైన ప్రజాసేవకులు ఎలా ఉండాలన్న దానికి నిదర్శనంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తీరు ఉందన్న వ్యాఖ్యలు వినిపించాయి.

Tags:    

Similar News