బాలినేనిని మిథున్ మ‌రిపించ‌గ‌ల‌రా...!

ఇక‌, ఇప్పుడు ప్రకాశం జిల్లాకు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఇంచార్జ్‌గా నియ‌మించారు.

Update: 2024-10-22 07:30 GMT

బాలినేని శ్రీనివాస‌రెడ్డి. వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి కూడా. అయితే.. ఆయ‌న ఇప్పుడు పార్టీ మారి జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. స‌హ‌జంగానే పార్టీలు మారిన త‌ర్వాత‌.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న పార్టీ నాయ‌కుడిని తిట్టిపోయ‌డం కామ‌న్‌. కానీ, బాలినేని మాత్రం ఈ విష‌యంలో సైలెంట్‌గా ఉన్నారు. ఇక‌, వైసీపీ నుంచి కూడా బాలినేనిని కౌంట‌ర్ చేయ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. బాలినేని విష‌యాన్ని వైసీపీ లైట్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, ఇప్పుడు ప్రకాశం జిల్లాకు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఇంచార్జ్‌గా నియ‌మించారు. అయితే.. బాలినే ని లేని లోటును కానీ.. ఆయ‌న తాలూకు హ‌వాను కానీ.. మిథున్ రెడ్డి ఏమేర‌కు నెర‌వేరుస్తార‌నేది ముఖ్యం. బాలినేని బాధ్య‌తలు చూసిన‌ప్పుడు.. అసంతృప్తుల‌ను కూడా బ‌య‌ట‌కు రాకుండా వ్య‌వ‌హ‌రించారు. పైగాబ‌ల‌మైన టీడీపీ నేత‌ల‌కు దీటుగా రాజ‌కీయాలు న‌డిపించారు. ఈ నేప‌థ్యంలోనే ఒంగోలు మునిసిపా లిటీ వైసీపీకి ద‌క్కింది. ఒకానొక ద‌శ‌లో చీలిక వ‌స్తుంద‌ని భావించినా బాలినేని వ్యూహాత్మ‌కంగా చ‌క్రం తిప్పారు.

ఇక‌, ఇప్పుడు మిథున్‌రెడ్డి ఏం చేస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఒంగోలు, చీరాల‌, అద్దంకి, ప‌రుచూరు వంటి కీల‌క‌మైన నియోజ‌క‌వర్గాల్లో పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా ఉంది. ఎవ‌రూ నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. ఒంగోలు లో బాలినేని బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. చీరాల‌లో క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూరి పాత గూటికి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అద్దంకిలో చెంచు గ‌ర‌ట‌య్య ఫ్యామిలీ టీడీపీ తీర్థం పుచ్చేసుకుంది. ఇక‌, ప‌రుచూరు లోనూ ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. జెండా మోసే నాయ‌కుడు లేకుండా పోయారు.

ఇలాంటి ప‌రిస్థితిలో ప‌గ్గాలు చేప‌ట్టిన మిథున్ రెడ్డి ఏ మేర‌కు బాలినేని లేని లోటును పూడుస్తార‌నేది చూడాలి. ఒక ర‌కంగా చెప్పాలంటే.. ఇక్క‌డి రాజ‌కీయాలు అవ‌గాహ‌న చేసుకునేందుకు.. ఇక్క‌డి నాయ‌కు ల‌ను అర్థం చేసుకునేందుకు కూడా మిథున్‌రెడ్డికి భారీగానే స‌మ‌యం ప‌ట్ట‌నుంది. పైగా పార్టీని బ‌లోపేతం చేయాలంటే.. ఉన్న నేత‌ల‌ను కాపాడాలి. లేని వారిని తీసుకురావాలి. ఇవ‌న్నీ చూస్తే.. అంత ఈజీకాద‌నేది ... బాలినేనికి ప్ర‌త్యామ్నాయం అవుతార‌ని భావించ‌డ‌మనేది కూడా క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News