మోడీ ఆస్తుల్లో 95% ఎక్కడ, ఎలా ఉన్నాయో తెలుసా?

అవును... తాజాగా మోడీ ఆస్తుల వివరాలు.. అవి ఏయే రూపాల్లో ఉన్నాయనే వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

Update: 2023-09-23 13:30 GMT

ప్రధాని మోడీ మార్చి 31తో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సమర్పించిన వివరాలతో ఆయన ఆస్తుల విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటి వివరాల ప్రకారం మోడీ ఆస్తులు గతేడాదితో పోలిస్తే కొంత పెరగగా... బ్యాంకులో ఫిక్స్‌ డ్‌, మల్టీఆప్షన్‌ డిపాజిట్లు, నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్లు, బంగారం వంటి ఆస్తుల వివరాలు తెలిశాయి.

అవును... తాజాగా మోడీ ఆస్తుల వివరాలు.. అవి ఏయే రూపాల్లో ఉన్నాయనే వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వీటి ప్రకారం ప్రధాని మోడీ మొత్తం ఆస్తి విలువ రెండు కోట్ల ఏభైఎనిమిది లక్షల తొంభైఆరువేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు (రూ.2,58,96,444)! దీన్ని గతేడాది నాటి ఆస్తి విలువ రూ.2,23,82,504 తో పోలిస్తే... రూ.35,13,940 పెరిగిందని తెలుస్తుంది.

ఇక ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ పేరున కొంత డబ్బు, బ్యాంకులో ఫిక్స్‌ డ్‌, మల్టీఆప్షన్‌ డిపాజిట్లు, నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్లు, నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. అవి మినహా ఆయన వద్ద ఇతర స్థిర, చరాస్తులేవీ లేవు. ఇలా ఉన్న ఆయన ఆస్తుల్లో గరిష్టంగా (95.55%) గుజరాత్‌ లోని గాంధీనగర్‌ లోని ఎస్‌బీఐ ఎన్‌.ఎస్‌.సీ బ్రాంచ్‌ లో ఫిక్స్‌ డ్‌, మల్టీఆప్షన్‌ డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి.

ప్రస్తుతం మోడీ వద్ద ఉన్న ఆస్తుల విషయాలు డిటైల్డ్ గా చూస్తే... చేతిలో ఉన్న డబ్బులు రూ.30,240 కాగా.. గాంధీ నగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మినిమం బ్యాలెన్స్ 574 రూపాయలు ఉంది. ఇదే క్రమంలో అదే బ్యాంక్ లో డిపాజిట్ల రూపంలో 2,47,44,335 రూపాయలు ఉన్నాయి.

ఇక నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ లో 9,19,635 రూపాయలు ఉండగా.. 45 గ్రాముల బరువున్న నాలుగు ఉంగరాల విలువ 2,01,660 గా ఉంది. ఇవి మొత్తం కలిపి రూ. 2,58,96,444 గా మోడీ ఆస్తులు ఉన్నాయి!

అయితే ఈ సందర్భంగా సతీమణి జసోదాబెన్‌ పేరున ఉన్న ఆస్తి వివరాలు తనకు తెలియవని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

Tags:    

Similar News