కాషాయ దుస్తులు-మఠం నిద్ర-ద్రవాహారం : మోడీ స్వామి.. నెటిజన్ల ట్రోల్స్!
తమిళనాడులోని కన్యాకుమారిలో నిర్మించిన స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేం ద్ర మోడీ ధ్యానమగ్నులై ఉన్నారు
తమిళనాడులోని కన్యాకుమారిలో నిర్మించిన స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేం ద్ర మోడీ ధ్యానమగ్నులై ఉన్నారు. ఏడో దశ ఎన్నికల ప్రచారం ముగించుకుని గురువారం సాయం త్రం కన్యాకుమారికి చేరుకున్న ఆయన.. ఆ క్షణం నుంచే సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు. మధ్య మధ్య స్వల్ప విరామాలతో 45 గంటలపాటు ప్రధాని ధ్యానం చేయనున్నారు. ఈ సమయంలో ఆయన కేవలం ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం, తేనె ఇతర ద్రవాహారాలను మాత్రమే ప్రధాని స్వీకరించనున్నారు. ధ్యాన సమ యంలో పూర్తి మౌనాన్ని పాటించనున్నారు. ధ్యాన మందిరం నుంచి దాదాపు బయటకు రారని.. కేవలం సూర్య నమస్కారాల కోసమే వస్తారని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ రోజు ఉదయం సూర్య నమస్కా రాలు సమర్పించిన ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపు సుముద్ర తీరంలోనే నిలబడి జపం చేశారు. పూర్తి కాషాయ దుస్తులు ధరించి.. నుదుటిన వీభూది రేఖలు పెట్టుకుని ప్రధాని కనిపించారు.
ఇదిలావుంటే, 2019లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేదార్‌నాథ్ వద్ద గుహల్లో ధ్యానం చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ప్రధాని మోడీ ధ్యానంపై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ``మోడీ స్వామి మరో రూపం`` అంటూ కొందరు వ్యాఖ్యలు చేయగా.. ``మోడీ స్వామి.. నమో.. నమో!`` అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. నమో-అంటే నరేంద్ర మోడీ అన్న విషయం తెలిసిందే.
రేపు మోడీ తీర్పు!
ఏడో దశ ఎన్నికల పోలింగ్ శనివారం జరగనుంది. మొత్తం 8 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పోలింగ్ కొనసాగనుంది. దీనిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం కూడా ఉండడం గమనార్హం. దీంతో ఎన్నికల పోలింగ్‌కు ముందు ఆయన ధ్యానం చేయడం కూడా.. ప్రాధాన్యం సంతరించుకుంది.