మోడీకి మ‌రో స‌ర్టిఫికెట్‌.. రాహుల్ కామెంట్ ఏంటి?

భారత్ ఆర్థిక వృద్దిలో గణనీయమైన పురోగతి సాధిస్తుందని ఐక్య‌రాజ్య‌స‌మితి తెలిపింది. అయితే.. ఇదంతా కూడా మోడీ దూర‌దృష్టి.. ఆయ‌న పాల‌న‌తోనే సాధ్య‌మైంద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Update: 2024-01-06 01:30 GMT

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి మ‌రో స‌ర్టిఫికెట్ ద‌క్కింది. తాజాగా భార‌త దేశ ప‌రిస్థితిపై ఐక్య‌రాజ్య‌స‌మితి ఓ నివేదిక వెలువ‌రించింది. మోడీ హ‌యాంలో దేశంలో అభివృద్ది వేగంగా సాగుతోంద‌ని, దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని ఐక్యరాజ్యసమితి ఆర్థిక రిపోర్టులో పేర్కొంది. స‌మితి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక‌నామిక్స్ అండ్ సోష‌ల్ అఫైర్స్ రిపోర్టు ప్రకారం.. భారత ఆర్థిక వృద్ధి 2024లో 6.2 శాతం ఉంటుందని తేలింది.

భారత్ ఆర్థిక వృద్దిలో గణనీయమైన పురోగతి సాధిస్తుందని ఐక్య‌రాజ్య‌స‌మితి తెలిపింది. అయితే.. ఇదంతా కూడా మోడీ దూర‌దృష్టి.. ఆయ‌న పాల‌న‌తోనే సాధ్య‌మైంద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఉత్పత్తి, తయారీ రంగాల్లో బలమైన వృద్ధి కారణంగా భారత్ దూసుకుపోతోందని తెలిపింది. గతేడాది దేశం అధిక పెట్టుబడులను ఆకర్షించినట్లు తెలిపింది.

నివేదిక సారాంశం ఇదీ..

ఐక్య‌రాజ్య‌స‌మితి ఆర్థిక విభాగం తాజాగా విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం.. ``ప్రభుత్వ మౌలిక సదుపాయా ల ప్రాజెక్టుల్లో పురోగతి, విదేశీ కంపెనీల రాక బాగా పెరిగింది. 2023 మూడో త్రైమాసికంలో మిగతా దేశాలతో పోల్చితే భారత్ మంచి ఫలితాలను కనబరిచింది. అభివృద్ధి చెందిన దేశాలకంటే అభివృద్ధి చెందుతు న్న దేశాలు పెట్టుబడుల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు రిపోర్టు స్పష్టం చేసింది. దక్షిణాసియాలో పెట్టుబ డులకు భారత్ స్వర్గధామంగా నిలిచింది`` అని నివేదిక తెలిపింది.

రాహుల్ ఏంటి?

అయితే.. ఈ ప‌రిణామం కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌ను ఇర‌కాటంలోకి నెట్టింది. ఆయ‌న ఇప్పుడు ఏమంటార‌నేది ఆస‌క్తిగా మారింది. ఎక్క‌డ ఏ వేదిక ఎక్కినా.. రాహుల్‌ గాంధీ ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. పైగా ఎన్నిక‌ల వేళ మ‌రింత దాడి పెంచారు. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూ హ్యంగా మోడీకి స‌ర్టిఫికెట్ ఇస్తూ.. ఐక్య‌రాజ్య‌స‌మితి విడుద‌ల చేసిన ఆర్థిక నివేదిక రాజ‌కీయంగా కూడా ప్ర‌భావితం చూపిస్తుంద‌ని అంటున్నారు. మ‌రి దీనిపై రాహుల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News