ఆ కుర్రాళ్ల బ్యాంక్ ఖాతాల్లో కోట్లాది రూపాయిల లావాదేవీలు కట్ చేస్తే?

తమిళనాడు జిల్లా తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు సమీపం కుమారాజీపేటకు చెందిన తమిళరసన్.. అరవిందన్.. ప్రకాష్ పోళింగర్ లోని టైర్ల తయారీ పరిశ్రమలో పని చేస్తూ నెల క్రితం మానేశారు.

Update: 2024-09-14 07:08 GMT

కోట్లాది రూపాయిలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావటం.. మళ్లీ వేరే అకౌంట్లకు బదిలీ కావటం.. అదే పనిగా సాగుతున్న ఈ వ్యవహారంపై ఫోకస్ చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు. ఈ సందర్భంగా వెల్లడైన షాకింగ్ నిజం అవాక్కు అయ్యేలా చేసింది. బ్యాంకు ఖాతాల్లో కోట్లకు కోట్ల మొత్తం పడటం.. వాటిని మరో ఖాతాకు మళ్లించటం లాంటివి పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. అంత భారీ ఎత్తున లావాదేవాలు జరుగుతున్న ఖాతాల మీద ఫోకస్ చేసిన అధికారులు.. బ్యాంకు లో పేర్కొన్న చిరునామాకు వెళ్లగా.. ఖాతాదారులు పూరి గుడిసెల్లో ఉన్న వైనం చూసి షాక్ తిన్నారు. చివరకు వారు మోసాలకు పాల్పడుతున్న వైనాన్ని గుర్తించి అరెస్టు చేశారు.

తమిళనాడు జిల్లా తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు సమీపం కుమారాజీపేటకు చెందిన తమిళరసన్.. అరవిందన్.. ప్రకాష్ పోళింగర్ లోని టైర్ల తయారీ పరిశ్రమలో పని చేస్తూ నెల క్రితం మానేశారు. వారి బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.3 కోట్ల ఆన్ లైన్ నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఈడీకి సమాచారం అందింది. అధికారులు గురువారం సాయంత్రం వారి ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. గుడిసెల్లో ఉన్న వారి జీవనస్థాయిని చూసిన అధికారులు.. వారిని అదుపులోకి తీసుకొని బెంగళూరుకు తరలించారు.

ఈ సందర్భంగా వారిని విచారించిన అధికారులకు కొత్త విషయాలు బయటకు వచ్చాయి. వారు ఉద్యోగం కోసం చెన్నైకు వెళ్లారు. అక్కడ వారికి అజ్మల్ అనే వ్యక్తిని కలిశారు. అతని సలహాతో వీరు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయించారు. అనంతరం వీరి ఖాతాల్లోకి రూ.కోటి చొప్పున ముగ్గురికి కలిపి రూ.3 కోట్లు జమ చేశారు. ఆ తర్వాత వేరే ఖాతాలకు జమయ్యాయి. వీరు హవాలా.. ఆన్ లైన్ మోసాలకు పాల్పడే మూఠాలకు తమ బ్యాంకు ఖాతాల యాక్సిస్ ఇవ్వటంతో ఇలాంటివి జరిగి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే అజ్మల్ పై గతంలో రూ.8 కోట్ల హవాలా నగదు మోసం కూడా ఉంది. దీనిపై కేసు నమోదు చేశారు ఏపీలోని చీరాల పోలీసులు. ఈ ఉదంతం తాజాగా సంచలనంగా మారింది.

Tags:    

Similar News