చైనాలో మరో కలకలం... కొత్త వేరియంట్ తో కలవరం!

ఇప్పటికే చైనాలో హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) కలకలం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-10 13:19 GMT

ఇప్పటికే చైనాలో హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) కలకలం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ కు సంబంధించిన కేసులు ఇప్పుడు భారత్ లోనూ కలకలం రేపుతున్నాయి. వీటిపై భయాందోళనలు అవసరం లేదని ప్రభుత్వం చెబుతున్నా ఆందోళనలు ఆగడం లేదని అంటున్నారు. ఈ సమయంలో చైనాలో మరో కలకలం మొదలైంది.

అవును... ఇప్పటికే ఒకసారి కరోనా వైరస్ తో ప్రపంచాన్ని వణికించిన చైనాలో.. ఇప్పుడు తాజాగా మంకీపాక్స్ వైరస్ కొత్త వేరియెంట్ కలకలం రేపుతోంది. దీన్ని క్లేడ్ 1బి అని పిలుస్తున్నారు. కాంగో నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో దీన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. అతడి క్లోజ్ కాంటాక్ట్స్ లో నలుగురికి కూడా ఈ కొత్త వేరియంట్ సోకినట్లు చెబుతున్నారు.

దీంతో... కరోనా వైరస్ తరహాలో ఇది స్ప్రెడ్ అవుతుందనే ఆందోళనలు మొదలైనట్లు చెబుతున్నారు. ఈ సమయంలో మంకీపాక్స్ లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే వెంటనే చెప్పాలని అధికారులు ప్రకటించారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆ లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉంటూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

వాస్తవానికి మంకీపాక్స్ వైరస్ కొత్త వేరియంట్ ను తొలుత ఫ్రాన్స్ లో కనిపెట్టగా.. ఇప్పుడు చైనాలో మళ్లీ కనిపించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చైనాలోని బీజింగ్, ఝెజియాంగ్, గ్వాంగ్డాంగ్, తియాంజిన్ పట్టణాల్లో ప్రభుత్వం తరుపున ప్రజలకు అలర్ట్స్ తో పాటు నియంత్రణ చర్యలు ప్రారంభించారని అంటున్నారు.

వైరస్ లక్షణాలు!:

మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తికి చలి, జ్వరంతో పాటు తలనొప్పులు, ఒళ్లు నొప్పులు, చర్మంపై వాపులు వస్తాయని చెబుతున్నారు. తర్వాత కొన్ని రోజుల్లో దద్దుర్లు వస్తాయని.. అనంతరం చర్మం ఎర్రగా కందిపోయి, బొబ్బలు వస్తాయి. ఆ తర్వాత నీటితో నిండిన పొక్కులు వస్తాయి. ఈ లక్షణాలు రెండు నుంచి నాలుగు వారాలు ఉంటాయి.

వ్యాక్సిన్..!:

వాస్తవానికి మంకీపాక్స్ కి వ్యాక్సిన్ ఉన్నప్పటికీ.. కొత్త వేరియంట్లు ఒక్కోసారి ఈ వ్యాక్సిన్ ను తట్టుకోగలవని చెబుతున్నారు. అయితే... దీనిపై మరిన్ని పరీక్షలు జరపాల్సి ఉందని అంటున్నారు. ఇదే సమయంలో.. ప్రస్తుతానికి ఆందోళన చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చైనా చెబుతోంది.

Tags:    

Similar News