మన ఎంపీలు ఎంత సంపాదిస్తారో తెలుసా?

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలతో భారతదేశానికి 543 మంది కొత్త లోక్ సభ సభ్యులు ఎన్నికయ్యారు. ఇప్పుడు వారి జీత భత్యాల గురించి తెలుసుకుందాం...!

Update: 2024-10-22 11:37 GMT

లోక్ సభలో పార్లమెంట్ సభ్యుడు అంటే... ఏదేని ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన లోక్ సభ నియోజకవర్గం నుంచి భారత పార్లమెంట్ దిగువ సభకు ప్రతినిధి. ఈ క్రమంలో... ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలతో భారతదేశానికి 543 మంది కొత్త లోక్ సభ సభ్యులు ఎన్నికయ్యారు. ఇప్పుడు వారి జీత భత్యాల గురించి తెలుసుకుందాం...!

అవును... లోక్ సభ ఎంపీలు పొందుతున్న జీతాలు, ప్రయోజనాలు, పెన్షన్ మొదలైనవి ఎంతెంత ఉంటాయి.. ఎలా ఎలా ఉంటాయి.. ఏమేమి ఉంటాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం...!

భారతదేశంలో ప్రతీ ఎంపీ నెలకు రూ.1,00,000 జీతాన్ని పొందుతారు. ఇదే సమయంలో... రోజుకు రూ.2,000 చొప్పున అలవెన్సులు అందుతాయి. వీటితో పాటు నియోజకవర్గ అలవెన్సుల కింద నెలకు రూ.70,000లతో పాటు ఆఫీసు మెయింటినెన్స్ ఖర్చుల కింద నెలకు రూ.60,000 తీసుకుంటారు.

అంటే... ప్రతీ ఎంపీకి నెలకు రెండు లక్షల ముప్పై వేలతో పాటు రోజుకు రూ.2 వేల అలవెన్సులు లభిస్తాయన్నమాట. వీటితో పాటు ఫోన్, ఇంటర్నెట్ వినియోగం కోసం ఏడాదికి రూ.1,50,000 ఇస్తారు. ఇక ప్రయాణం విషయానికొస్తే... ఏడాదికి 34 ఉచిత డొమెస్టిక్ విమాన ప్రయాణాలతో పాటు ఉచిత ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం సదుపాయం ఉంటుంది.

ఇదే క్రమంలో... ఏడాదికి ఏభై వేల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ తో పాటు 4,000 కిలో లీటర్ల ఉచిత నీటి సరఫరా కూడా అందజేస్తారు. ఇక వీటితో పాటు పెన్షన్ కు అర్హులైన వారికి నెలకు రూ.25,000 అందజేస్తారు. ఇదే క్రమంలో... సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద ఎంపీ, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సదుపాయం ఉంటుంది.

ఇదే సమయంలో... వారి వసతి కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది. వారి ఐదేళ్ల పదవీ కాలంలో అద్దె రహిత గృహాలు అందించబడతాయి. ఈ విషయంలో పలు అంశాల ఆధారంగా అపార్ట్మెంట్ లు లేదా బంగ్లాలు పొందవచ్చు. ఈ నేపథ్యంలో అధికారిక వసతిని వినియోగించకూడదని ఎంచుకున్న వ్యక్తులు నెలవారి గృహ భత్యం కింద రూ.2,00,000 పొందేందుకు అర్హులు.

Tags:    

Similar News