ఆ దేశంలో మ్యూజిక్ బ్యాన్... అక్కడంతే!

తాజాగా తాలిబన్‌ ప్రభుత్వ అధికారులు సంగీతం అనైతికమైనదని తీర్మానించారు.

Update: 2023-07-31 06:53 GMT

అఫ్ఘానిస్తాన్‌ లో తాలిబాన్‌ ఆంక్షలు, దురాగతాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆఫ్ఘాన్ వారి చేతుల్లోకి వెళ్లినప్పటినుంచీ అక్కడ ప్రజల పరిస్థితి లో కనిపించిన దయణీయమైన మార్పు గురించి వివరణ అవసరం లేదు. మరి ముఖ్యంగా యువత, మహిళల పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారయ్యిందని అంటుంటారు.

ఈ నేపథ్యంలో తాలిబాన్లు మరో దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. ఇందు లో భాగంగా ఆ దేశం లో సంగీతాన్ని నిషేదించారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా అది తాలిబాన్ల చేతుల్లోని ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి కచ్చితంగా నమ్మొచ్చు. ప్రస్తుతం ఈ విషయం తాలిబాన్ల చేతుల్లో ఆఫ్ఘాన్ ప్రజల పరిస్థితి ని మరోసారి తెరపైకి తెచ్చింది.

అవును... తాజాగా తాలిబన్‌ ప్రభుత్వ అధికారులు సంగీతం అనైతికమైనదని తీర్మానించారు. దీంతో ప్రజల దగ్గర నుంచి సంగీత పరికరాల ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హెరాత్‌ ప్రాంతం లో ఆ పరికరాలన్నింటినీ దహనం చేశారు. ఫలితంగా వారికంటూ ఉన్న ప్రత్యేక ఆనందాన్ని పొందినట్లున్నారు.

సంగీతాన్ని ప్రోత్సహించడం అనేది నైతిక విలువలను దెబ్బతీస్తుందని, సంగీతాన్ని వాయించేవారు తప్పుదారి పడతారని ఈ సందర్భంగా స్థానిక అధికారి అల్‌-ముజ్రిమ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. తప్పుదారి పట్టడం, తప్పుడు ఆలోచనలు చేయడం గురించి తాలిబన్లు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాదా అని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా... 2021 ఆగస్టులో అఫ్ఘానిస్తాన్‌ ను కబ్జా చేసుకున్న తాలిబాన్‌ నేతలు ఇష్టమొచ్చిన రీతిన కఠిన శాసనాలను, చట్టాల ను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా బహిరంగంగా సంగీతం ఆలపించడం పై నిషేధం విధించారు. వేల డాలర్ల విలువైన వాయిద్య పరికరాలను స్థానిక ప్రజల నుంచి స్వాధీనం చేసుకుని వాటిని దహనం చేశారు.

వీటిలో గిటార్‌, తబలా, డ్రమ్‌ తదితర వాయిద్య పరికరాలతో పాటు ఆంప్లిఫయర్‌, స్పీకర్‌ మొదలైనవి ఉన్నాయి. దీనికి ముందు బ్యూటీ పార్లర్ల పై నిషేధం విధించారు.

Tags:    

Similar News